మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఔదార్యం.. యాచకురాలికి దగ్గరుండి అంత్యక్రియలు, శెభాష్ అంటూ..

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా వైరస్ దెబ్బకు జనం గజ గజ వణికిపోతున్నారు. వైరస్ గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ నేతలు బిజీ బిజీగా ఉన్నారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా తన నియోజకవర్గంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. కానీ ఓ యాచకురాలు చనిపోయారని తెలుసుకొని, చలించిపోయారు. దగ్గరుండి మరీ దహన సంస్కారాలు చేయించారు. తన నియోజకవర్గంలోని ఓ బిచ్చగత్తెపై.. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్న సమయంలో మంత్రి చూపిన ఔదార్యాన్ని ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

పాలమూరు జిల్లా కేంద్రంలో ఓ యాదమ్మ అనే యాచకురాలు ఉన్నారు. ఆమెకు కుమారుడు కూడా ఉన్నారు. కానీ మతిస్థిమితం లేదు. ఆమె గురువారం చనిపోయారు. కరోనా వైరస్ గురించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కూరగాయాల మార్కెట్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలి, కుమారుడు ఇద్దరూ కలిసి భిక్షాటన చేసి.. తెలంగాణ చౌరస్తాలో ఉంటారని తెలుసుకున్నారు. వెంటనే యాచకురాలి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

minister srinivas goud Participated woman Funeral..

మంత్రి ఆదేశాలతో అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వారు ఉన్న వద్దకు వచ్చిన వాహనంలో స్వయంగా వృద్దురాలి మృతదేహాన్ని తీసుకెళ్లారు. కరోనా వైరస్ వల్ల ఇతరులకు హానీ కలుగొద్దని, ఓ మనస్సున మనిషిగా యాచకురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుకొచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు బయటకు వెళ్లొద్దని ప్రజలను మంత్రి కోరారు.

English summary
telangana minister srinivas goud Participated woman Funeral in mahabubnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X