మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతులకు వంచన, కేంద్రం, రాష్ట్రానిదీ అదే తీరు, రేవంత్ రెడ్డి విసుర్లు

|
Google Oneindia TeluguNews

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఉరుకొండ మండలం జకునాలపల్లిలో రాజీవ్ భరోసా యాత్ర చేపట్టారు. రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ఇవ్వని వారు చరిత్ర హీనులవుతారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యాయని రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.

రైతు నేతల నిరసన కంటిన్యూ అవుతోన్న కేంద్రం స్పందించడం లేదు. వ్యవసాయ చట్టాల గురించి ఊసు ఎత్తడం లేదు. పైగా తాము మంచి చేశామని కలరింగ్ ఇస్తున్నారు. రైతుల ఆందోళనకు విపక్షాలు/ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో నిరవధిక నిరసన చేస్తామని రైతు నేతలు ప్రకటించారు. కూలర్లు, ఫ్యాన్లు తీసుకొని మరీ ఆందోళనకు సిద్దమవుతోన్నారు. కొద్దిరోజుల్లో వేసవి తీవ్రత దృష్ట్యా రైతు నేతలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Revanth reddy slams central/ state governments

తెలంగాణ ప్రభుత్వంపై ఆడపా దడపా రేవంత్ రెడ్డి ఫైరవుతున్నారు. ఇటు కేంద్రంపై కూడా విరుచుకుపడుతున్నారు. రైతులపై ఇద్దరిదీ సవతి ప్రేమ అంటూ ఫైరయ్యారు. కానీ పైకీ మాత్రం మొసలి కన్నీరు కారుస్తాయని చెప్పారు. ఆ ప్రభుత్వాల తీరును ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు బుద్ది చెబుతారని స్పష్టంచేశారు. ఇందులో అనుమానానికి తావులేదని చెప్పారు.

English summary
congress leader Revanth reddy slams central/ state governments on farmers issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X