petrol rate:భగ్గుమన్న జేజమ్మ.. కేసీఆర్ మీరెందుకు తగ్గించారు..
కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది. దీంతో కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రో ధరలను తగ్గించాయి. మరికొన్ని రాష్ట్రాలు స్పందించలేదు. దీంతో బీజేపీ నేతలు మీరేందుకు ధర తగ్గించరు అని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిన రీతిలోనే రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత తగ్గింపు ప్రకటించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కూడా..
అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో డీజిల్, పెట్రోలు ధరల తగ్గింపునకు కొంత రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో తగ్గించకపోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజా రవాణా ఆర్టీసీలో టికెట్ రేట్లను పెంచాలని ప్రయత్నించడం దుర్మార్గపు ఆలోచన డీకే అరుణ విరుచుకుపడ్డారు. మద్యపానంపై వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను నడపాలనుకోవడం దౌర్భాగ్యం అని వివరించారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. వేల కోట్లు గుమ్మరించి.. మద్యాన్ని ఏరులై పారించి, పథకాలతో ప్రలోభ పెట్టినా ప్రజలు తిరస్కరించడాన్ని కేసీఆర్ గుణపాఠంగా తీసుకోవాలని అరుణ హితవు పలికారు.

తగ్గింపు ఇలా..
పెట్రోల్, డీజీల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర తగ్గించడంతో లక్ష కోట్ల మేర ఆదాయం తగ్గుతుంది. దేశంలో ఇంధర ధరలు అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం.. దానికి తోడు కట్టడి చేయలేని స్థితికి ద్రవ్యోల్బణం చేరుకున్నాయి. వీటికి తోడు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీని ఎప్పుడో దాటేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర అయితే ఏకంగా 120 దాటేసింది. అన్ని వైపుల నుంచి విమర్శలతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దీంతో మెట్టు దిగి వచ్చి ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించుకుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

పెంచి..
రూ.40 పెంచి రూ.5 తగ్గించడం ఏంటీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి దీపావళి పేరు చెప్పి.. ఇంత తగ్గించడం ఏంటీ అని అడుగుతున్నారు. మరికొందరు మాత్రం పండగ అయిపోయిన తర్వాత ధరలు పెంచుతారని అంటున్నారు. ఇటు పెట్రో ధరలు కూడా వ్యాట్ పరిధిలో ఉన్నాయి. అదే జీఎస్టీ పరిధిలో ఉంటే.. ధర తగ్గేది. దానిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు కోరుతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోంది. కానీ కొత్త ప్రతిపాదన మాత్రం బాగుంది. ఆచరణ సాధ్యం అవుతుందో లేదో చూడాలీ మరీ.