మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TSRTC STRIKE:మరో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం, ఖాజా టెంపరరీ డ్రైవర్, 17 మంది మృతి

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల బలవన్మరణాల పరంపర కొనసాగుతోంది. గత 28వ రోజులుగా సమ్మె చేయడంతో కార్మికులు ఊపిరి తీసుకుంటున్నారు. ఇప్పటికే 17 మంది డ్రైవర్లు, కండక్టర్లు చనిపోయారు. గురువారం సాయంత్రం ప్రకాశ్ అనే కండక్టర్ కూడా గుండెపోటుతో నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం మరో డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. కార్మికుల ఆత్మహత్యలు కలవరానికి గురిచేస్తోంది.

TSRTC STRIKE:ఆర్టీసీ ఆర్థికపరిస్థితిపై యాజమాన్యం అఫిడవిట్, తప్పులతడక అన్న హైకోర్టు..TSRTC STRIKE:ఆర్టీసీ ఆర్థికపరిస్థితిపై యాజమాన్యం అఫిడవిట్, తప్పులతడక అన్న హైకోర్టు..

 మరో డ్రైవర్..

మరో డ్రైవర్..

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ డిపోకు చెందిన తాత్కాలిక డ్రైవర్ ఖాజా ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందుతాగాడు. వెంటనే అతనిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఖాజాకు చికిత్స అందిస్తున్నారు. ఖాజా స్వస్థలం నాగర్ కర్నూలు కాగా.. షాద్ నగర్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్య చేసుకుంటుండగా.. తాత్కాలిక డ్రైవర్ కూడా ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది.

 అందని జీతం.. లేని పని

అందని జీతం.. లేని పని

గత నెల జీతం ఇంకా చేతికి అందకపోవడం.. దాదాపు నెలరోజుల నుంచి ఊరికేనే ఉండటంతో ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. టీవీలో ప్రభుత్వ ప్రకటనలు, సీఎం, మంత్రులు ప్రసంగాలు వింటూ కొందరు గుండెపోటుకు గురయ్యారు. మరికొందరు వేతనం లేక, ఉద్యోగం లేక ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ కార్మిక జేఏసీ డిమాండ్లపై పట్టుబడుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఆర్థికభారం లేని డిమాండ్లకే ఓకే చెబుతుంది. ఆర్టీసీ విలీనానికి మాత్రం ససేమిరా అంగీకరించడం లేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు-ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

టెంపరరీ డ్రైవర్..

టెంపరరీ డ్రైవర్..

ఇప్పటివరకు చనిపోయిన డ్రైవర్లు, కండక్టర్లు శాశ్వత ఉద్యోగులు కాగా.. ఆత్మహత్యాయత్నం చేసిన ఖాజా మాత్రం టెంపరరీ ఉద్యోగి. ఆయన కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం ఆర్మీసీని, కార్మికులను ఒకింత ఇబ్బందికి గురిచేస్తోంది. ఓ వైపు కార్మికులు పిట్టల్లా రాలుతున్న మరోవైపు ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా మాత్రం స్పందించడం లేదు.

టీవీ చూస్తూ గుండెపోటుకు..

టీవీ చూస్తూ గుండెపోటుకు..

హన్మకొండలోని తన ఇంటిలో టీవీ చూస్తున్న రవీందర్ అనే కండక్టర్ గురువారం సాయంత్రం కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వారంతా మనోధైర్యం కోల్పోయి చనిపోయారు.

English summary
another rtc driver khaja suicide attempt. he is temporary driver in shadnagar bus depot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X