మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TSRTC STRIKE:విధుల్లో చేరిన కార్మికులు, ఉద్యమ ద్రోహులని దాడి..?, రంగంలోకి పోలీసులు...

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 33వ రోజు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ డ్యూటీలో చేరడంపై తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దాడికి దిగారు. వెంటనే కల్పించుకున్న పోలీసులు నిలువరించడంతో గొడవ సద్దుమణిగింది.

ఎలా చేరతారు..?

ఎలా చేరతారు..?

గత నెలరోజుల నుంచి పాలమూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు మహబూబ్‌నగర్‌లో కండక్టర్ కోమలి, డ్రైవర్ వాజిద్, తాజుద్దీన్ విధుల్లో చేరారు. ముగ్గురు కార్మికులు తమతో నిరసనలో పాల్గొని.. ఇప్పుడు డ్యూటీ ఎక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్ వద్ద వారిపై దాడి చేసేందుకు యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో కండక్టర్, డ్రైవర్ బయటపడ్డారు.

ఉద్యమ ద్రోహులే..

ఉద్యమ ద్రోహులే..

ముగ్గురు ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. తమతో కాకుండా సీఎం కేసీఆర్ చెప్పారని విధుల్లో చేరడం సరికాదన్నారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ అని వారు నినాదించారు. ఇంతలో బస్టాండ్ వద్ద ముగ్గురు ఉద్యోగులు తారసపడ్డారు.

దాడి చేసే యత్నం..?

దాడి చేసే యత్నం..?

ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారని రగిలిపోయారు. వారిని పట్టుకొని భౌతికదాడి దిగేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే పోలీసులు ఉండటంతో డ్రైవర్లు సురక్షితంగా బయటపడగలిగారు. కానీ మహిళ కండక్టర్ మాత్రం వారికి చిక్కారు. పట్టుకోవడంతో.. మహిళ ఉద్యోగి వదలంటూ మిగతావారు కూడా ఆరిచారు. వారి బారి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకోగలిగారు.

అల్టిమేటం

అల్టిమేటం

ప్రభుత్వం తమ డిమాండ్లు తీర్చేవరకు సమ్మె విరమించేది లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి పేర్కొన్నారు. తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ బకాయి ఎందుకు ఇప్పించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీకి రూ.5 వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతారే తప్ప సంస్థను సంరక్షించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న బస్టాండ్లకు వస్తోన్న ప్రకటనల ఆదాయ వివరాలు ఏవీ, నగదు ఎక్కడికి వెళ్తుందని అశ్వత్ధామరెడ్డి ప్రశ్నించారు.

English summary
rtc workers attack who resume their duties in mahabubnagar.conductor komali, drivers tajuddin, wajid join the duty for cm kcr call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X