కేసీఆర్ ఓ రాక్షసుడు: నిరుద్యోగ నిరహార దీక్షలో షర్మిల
రైతును రాజు చేయాలన్నదే వైఎస్ఆర్ సంకల్పం అని షర్మిల అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 64లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి, దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. రైతులకు పెట్టుబడి తగ్గించి, రాబడి పెరిగేలా చేశారని తెలిపారు. మహిళలకు పావులా వడ్డీకే రుణాలు అందజేసి, ఆర్థికాభివృద్ధి సాధించేలా కృషి చేశారని వివరించారు. ఎవరూ ఆలోచన చేయని విధంగా పేదలకు ఉచిత వైద్యం అందించారని తెలిపారు. 108 ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు తీసుకొచ్చారని... పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్ మెంట్ అందించారని గుర్తుచేశారు. వైఎస్ హయాంలో పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 45 లక్షల పక్కా ఇండ్లు కట్టించి ఇస్తే... ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ 46లక్షల పక్కా ఇండ్లు కట్టించి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. ఐదేండ్లలో ఎలాంటి పన్నులు, చార్జీలు పెంచకుండా ప్రజారంజక పాలన అందించారని షర్మిల వివరించారు. సంక్షేమ పథకాలను అద్భుతంగా నడిపించి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారని పేర్కొన్నారు. ఐదేండ్లలో నిరుద్యోగుల కోసం మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. ఇవి కాకుండా ప్రైవేటు రంగంలో 11 లక్షల ఉద్యోగాలను సృష్టించారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు.

గారడి మాటలు..
రైతులకు
రుణమాఫీ
చేస్తానని
గద్దెనెక్కిన
కేసీఆర్..
ఆ
తర్వాత
దాని
ఊసే
మర్చిపోయారని
షర్మిల
విరుచుకుపడ్డారు.
ఉప
ఎన్నికల
నేపథ్యంలో
50
వేల
లోపు
రుణాలను
మాఫీ
చేస్తానని
చెప్పి,
మోసం
చేశాడని
పేర్కొన్నారు.
రాష్ట్రంలో
30
లక్షల
మంది
రుణమాఫీ
కోసం
వేచిచూస్తున్నా
కేసీఆర్‌లో
మాత్రం
చలనం
లేదన్నారు.
విద్యార్థులకు
కేజీ
టూ
పీజీ
ఉచిత
విద్య
అందిస్తానని
చెప్పి,
దగా
చేశాడని
విమర్శించారు.
రీయింబర్స్
మెంట్
బకాయిలు
విడుదల
చేయకుండా
విద్యార్థులకు
ఉన్నత
విద్యను
దూరం
చేశాడని
పేర్కొన్నారు.
పెన్షన్లు,
రేషన్
కార్డులు
పెండింగ్‌లో
పెట్టి
ముప్పు
తిప్పలు
పెడుతున్నాడని
చెప్పారు.
కేసీఆర్
హయాంలో
నిరుద్యోగం
నాలుగు
రెట్లు
పెరిగిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా
54
లక్షల
మంది
తాము
నిరుద్యోగులు
ప్రభుత్వానికి
దరఖాస్తు
పెట్టుకున్నారు.
నోటిఫికేషన్లు
రాక
నిరుద్యోగులు
వయసు
పైబడి,
కుటుంబానికి
భారమై,
సమాజంలో
తలెత్తుకు
తిరగలేక
మనస్తాపం
చెంది
ఆత్మహత్యలు
చేసుకుంటున్నారు.
కేసీఆర్
మాత్రం
'ఎంత
మంది
చనిపోతే
నాకేంటి
నా
ఇంట్లో
నాలుగు
ఉద్యోగాలు
ఉన్నాయని'
మురిసిపోతున్నాడు.
కేసీఆర్
నోటిఫికేషన్లు
ఇచ్చి
ఉంటే
వందలాది
మంది
బతికేవారు.
నిరుద్యోగులను
హత్య
చేస్తున్న
హంతకుడు
కేసీఆర్.
ఉద్యమ
సమయంలో
చందమామ
లాంటి
పిల్లలు
చనిపోతున్నారని,
స్వరాష్ట్రం
వస్తే
మన
ఉద్యోగాలు
మనమే
భర్తీ
చేసుకోవచ్చని
నమ్మించాడు.
ఇవాళ
ఉద్యోగాలు
భర్తీ
చేయకుండా
నిరుద్యోగులను
చంపుతున్నాడు.
కేసీఆర్
వెంటనే
రాజీనామా
చేసి,
దళితున్ని
ముఖ్యమంత్రి
చేయాలని
షర్మిల
డిమాండ్
చేశారు.

20 ఏళ్లు ఉంటే ఎంత మందిని చంపుతారు?
మరో 20 ఏండ్లు తామే అధికారంలో ఉంటామని టీఆర్ఎస్ లీడర్లు బీరాలు పలుకుతున్నారని చెప్పారు. ఏడేండ్లలో 7వేల మంది రైతులను, వందలాది మంది నిరుద్యోగులను చంపిన ప్రభుత్వం.. 20 ఏండ్లలో ఎంతమందిని చంపాలని అనుకుంటుందో? సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు. ఉద్యమ సమయంలో కొట్లాడిన పాలమూరు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను కేసీఆర్ నిలువునా మోసం చేశాడు. ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదు. ఏడేండ్లుగా టెట్ నోటిఫికేషన్ కూడా వేయలేదని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ఖాళీల వర్సిటీగా పాలమూరు
బడుగు, బలహీన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో ఆనాడు వైఎస్ఆర్ పాలమూరు యూనివర్సిటీని కట్టించారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఉచిత విద్యను చేరువ చేశారు. కానీ కేసీఆర్ తీరుతో పాలమూరు వర్సిటీ అస్తవ్యస్తంగా మారిందన్నారు. వర్సిటీలో 13 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరు కూడా లేరన్నారు. 24 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను 20 ఖాళీలే ఉన్నాయి. 58 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన యూనివర్సిటీలో 18 మంది మాత్రమే ఉన్నారు. 95 మంది బోధనా సిబ్బంది అవసరం కాగా 22 మంది మాత్రమే ఉన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారనే ఉద్దేశంతోనే విద్యా వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నాడు. తెలంగాణ వస్తే పాలమూరులో వలసలు తగ్గుతాయని చెప్పిన కేసీఆర్.. ఉపాధి లేక గత ఏడేండ్లలో 10లక్షల మంది పొట్టచేతిన పట్టుకుని వలస వెళ్లారు. ఉద్యమ సమయంలో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తే... 'మనం అధికారంలోకి వస్తే మనమే నోటిఫికేషన్లు ఇవ్వొచ్చని' నిరుద్యోగులను రెచ్చగొట్టి హాల్ టికెట్లు చింపేశారు. విద్యార్థుల పోరాటంతో వచ్చిన తెలంగాణలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా కేసీఆర్ వేయలేదన్నారు.

ఆ ధైర్యం ఉందా?
ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్ కు కనీసం విద్యార్థుల ముందు నిలుచునే ధైర్యం కూడా లేదన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోగా 52 వేల మందిని వివిధ ఉద్యోగాల నుంచి తీసేశాడని చెప్పారు. ఆయన కుటుంబం మాత్రం రాజకీయ నిరుద్యోగం లేకుండా పదవులు అనుభవిస్తోంది. డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీ చేసిన తెలంగాణ బిడ్డలు మాత్రం బర్లు, గొర్లు కాచుకుని, చేపలు పట్టుకోవాలని చెబుతున్నాడు. ఓ మంత్రి హమాలీ పనిచేసుకోవాలని చెబుతున్నాడు. అయిదో తరగతి చదువుకున్న వాళ్లు మాత్రం మంత్రులు కావొచ్చు.. డిగ్రీలు చదువుకున్న వాళ్లు మాత్రం బర్లు కాచుకోవాలి.. ఇదీ కేసీఆర్ తీరు అని మండిపడ్డారు.

శ్రీనివాస్ గౌడ్ జిల్లాకు ఏం చేశారు?
మంత్రి
శ్రీనివాస్
గౌడ్
ధ్యాసంతా
ఆస్తుల
పెంపకం,
ఫామ్
హౌజ్‌ల
నిర్మాణంపైనే
ఉందన్నారు.
జిల్లా
అభివృద్ధి
ఏ
మాత్రం
పట్టడం
లేదు.
వైఎస్ఆర్ను
దొంగతో
పోల్చిన
ఈ
దొంగ
మంత్రి..
కేసీఆర్
కు
తొత్తులా
వ్యవహరిస్తున్నాడని
మండిపడ్డారు.
వైఎస్ఆర్
దొంగనో,
కేసీఆర్
దొంగనో
ప్రజలకు
తెలుసు.
ఐదేండ్లలో
లక్షల
ఉద్యోగాలు
భర్తీ
చేసిన
వైఎస్ఆర్
దొంగనో..
ఉద్యోగాలు
భర్తీ
చేయకుండా
50
వేల
ఉద్యోగాలు
తీసివేసిన
కేసీఆర్
దొంగనో
నిరుద్యోగులకు
తెలుసు.
కరోనా
సమయంలో
ఆరోగ్యశ్రీలో
చేర్చకుండా
ప్రైవేట్
హాస్పిటళ్లకు
కోట్లు
దోచిపెట్టిన
కేసీఆర్
రాక్షసుడో...
పేదలకు
ఆరోగ్యశ్రీ
ద్వారా
ఉచిత
వైద్యం
అందించిన
వైఎస్ఆర్
రాక్షసుడో..
అందరికీ
తెలుసు.
నిరుద్యోగులు,
యువకులు
ఆత్మబలిదానాలపై
అధికారంలోకి
వచ్చిన
కేసీఆర్...ఓ
నియంతలా
వ్యవహరిస్తున్నాడు.

వైఎస్ఆర్ను కించపరిస్తే ఊరుకునేది లేదు
వైఎస్ఆర్ను కించపరిస్తే ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు తరిమి తరిమి కొట్టి, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారని తెలిపారు. ఆ మహానేతను విమర్శిస్తే ఊరుకునేది లేదు. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్ల చేతిలో బందీ అయినట్లే తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. ప్రజలు తిరగబడాల్సిన సమయం వచ్చిందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి, గట్టి బుద్ధి చెప్పాలి. నిరుద్యోగుల పక్షాన YSR తెలంగాణ పార్టీ చేస్తున్న పోరాటం ఆగదు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దు. హుజూరాబాద్‌లో నిరుద్యోగులంతా పోటీ చేసి, కేసీఆర్ నియంత పాలనను దేశమంతా ఎలుగెత్తి చాటాలి. నిరుద్యోగులకు అండగా ఉండి, అన్ని విధాలా సాయం చేస్తాం. ఇకనైనా కేసీఆర్ ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3లక్షల 85వేల ఖాళీలను సైతం భర్తీ చేయాలి. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వాలి. 54లక్షల మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలి. అర్హులకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు.