ప్రసవ వేదన .. వాగు దాటలేక 3 గంటలు నరకం చూసిన గిరిజన మహిళ అంబులెన్స్ లోనే డెలివరీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ గిరిజన ప్రాంతాలలో అడవి బిడ్డల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోడ్డు సదుపాయాలు లేక, వాహనాలు రాక, మెరుగైన వైద్య సదుపాయాలు అందక గిరిజన గ్రామాల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న గిరిజన మహిళను డోలీ కట్టి 20 కిలోమీటర్ల మేర మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన మరచిపోకముందే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రసవ వేదన అనుభవిస్తున్న మరో గిరిజన మహిళ డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లడానికి పడరాని పాట్లు పడింది. చివరికి అంబులెన్స్ లోనే ప్రసవించింది.
మంచిర్యాల జిల్లాలో గిరిజన గర్భిణీ మహిళకు పెద్ద కష్టం
వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన సుభద్రను, నెన్నెల మండలం కోనం పేట గ్రామానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చగా ప్రసవం కోసం తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకు వచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కల పల్లి గ్రామంలోని తల్లి గారి ఇంట్లో ఉన్న మానిపెళ్లి సుభద్రకు డెలివరీ సమయం ఆసన్నం కావడంతో ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే ఆస్పత్రికి ఆమెను తరలించే క్రమంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నక్కల పల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 108 కు కాల్ చేసినప్పటికీ 108 వాహనం నక్కల పల్లి గ్రామానికి వెళ్లే పరిస్థితి లేక వాగు ఇవతలే ఆగిపోయింది.
గర్భిణీని వాగు దాటించిన 108సిబ్బంది .. అంబులెన్స్ లోనే ప్రసవం
వాగు వద్ద కు చేరుకున్న గర్భిణీ వాగు దాటి లేక అవతల వైపు నిలుచుండి పోయింది. గర్భిణీ మహిళలకు ప్రసవవేదన మరింత తీవ్రం కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో 108 సిబ్బంది మహిళను వాగు దాటించడానికి ముందుకు వచ్చారు. అంబులెన్స్ లోని స్టెచ్చర్ ను తీసుకొని అతి కష్టం మీద వాగు దాటి అవతల వైపుకు వెళ్లిన 108 సిబ్బంది జల మహేష్, ఫరీద్ అహ్మద్, అవతల వైపున ఉన్న గ్రామస్తుల సహకారంతో అతికష్టం మీద వాగు దాటించారు. వాగు దాటిన అనంతరం మహిళను అంబులెన్స్ లోకి ఎక్కించి కోటపల్లి పీహెచ్సీకి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తీవ్రమైన ప్రసవవేదన తో బాధపడుతున్న మహిళ అంబులెన్స్ లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
డెలివరీ తర్వాత ఆస్పత్రిలో చేర్పించిన 108సిబ్బంది
గర్భిణీ
స్త్రీకి
పురిటి
నొప్పులు
ఎక్కువ
కావడంతో
108
సిబ్బంది
వాళ్ళ
ఉన్నతాధికారులకు
సమాచారం
అందించి,
వారి
సూచనల
మేరకు
ప్రసవం
చేయించారు.
ప్రసవానంతరం
తల్లి
బిడ్డ
ఇద్దరిని
కోటపల్లి
పీహెచ్సీకి
తరలించారు.
ప్రస్తుతం
తల్లీ
బిడ్డ
క్షేమంగా
ఉన్నారని
వైద్యులు
వెల్లడించారు.
గిరిజన
మహిళ
ప్రసవ
వేదన
అర్థం
చేసుకొని
సకాలంలో
స్పందించి
108
సిబ్బంది
గ్రామస్తులు,
మహిళ
కుటుంబ
సభ్యులకు
కృతజ్ఞతలు
తెలిపారు.
కానీ
శాస్త్ర
సాంకేతిక
రంగాల్లో
అభివృద్ధి
చెందిన
నేటి
రోజుల్లోనూ
పలు
గిరిజన
గ్రామాలకు
రోడ్డు
మార్గాలు
లేకపోవడం
గిరిజనుల
పాలిట
శాపంగా
మారింది.
రోడ్లు లేవు, వాగులపై బ్రిడ్జిలు లేవు .. నిత్యం నరకం చూస్తున్న గిరిజన గ్రామాలు
ఇక నక్కల పల్లి గ్రామ విషయానికి వస్తే ఈ గ్రామానికి వెళ్లే మార్గంలో సుమారు ఆరు గ్రామాల్లో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. వర్షాకాలం వస్తే వాగులు వంకలు పొంగిపొర్లితే ఈ గ్రామాల ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండవలసిన పరిస్థితి. సరైన రోడ్లు, వాగు పై బ్రిడ్జి లు లేక ప్రతి సంవత్సరాం ఈ గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక గిరిజన గ్రామాల ప్రజల కష్టాలు తెలిసి కూడా అధికార యంత్రాంగం స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచిర్యాల జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో నూ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోనూ గిరిజన ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితులే నిత్యం ఎదురవుతున్నాయి. ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి గిరిజనుల కష్టాలకు చెక్ పెట్టేలా వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని, రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.