• search
  • Live TV
మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వామ్మో టెంపరరీ డ్రైవర్.. మహిళా కండక్టర్‌పై అత్యాచార యత్నం..!

|

మంచిర్యాల : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు అధికారులు. అయితే టెంపరరీ స్టాఫ్‌తో అధికారులకు తలనొప్పి వ్యవహారాలు తప్పడం లేదు. ఒకవైపు యాక్సిడెంట్లు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న డ్రైవర్లు కొందరైతే.. సంస్థ పరువు తీస్తున్నవారు మరికొందరు తయారయ్యారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది.

మహిళా కండక్టర్‌పై లైంగిక దాడి

మహిళా కండక్టర్‌పై లైంగిక దాడి

శ్రీనివాస్ అనే వ్యక్తి మంచిర్యాల డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా చేరాడు. ఆ క్రమంలో అతడు చెన్నూరు - మంచిర్యాల రూట్‌లో ట్రిప్పులు కొడుతున్నాడు. అదే బస్సులో ఓ మహిళ టెంపరరీగా కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే చివరి ట్రిప్పులో చెన్నూరు నుంచి మంచిర్యాలకు వస్తున్న క్రమంలో ప్రయాణీకులు ఎవరూ బస్సు ఎక్కకుండా నిలువరించాడు. ఏదో కారణం చెప్పి ఖాళీ బస్సు డ్రైవ్ చేస్తూ వచ్చాడు. అయితే ఇదంతా కూడా పథకం ప్రకారమే చేశాడు.

ఉద్యమంతో గెలిచి, పోరాటాలను అణిచి.. విద్యాసంస్థల సెలవుల పొడిగింపు అందుకేనా..!

చివరి ట్రిప్పులో ప్లాన్.. ప్రయాణీకులు ఎక్కకుండా పథకం

చివరి ట్రిప్పులో ప్లాన్.. ప్రయాణీకులు ఎక్కకుండా పథకం

గురువారం రాత్రి చెన్నూరు నుంచి మంచిర్యాలకు చివరి ట్రిప్పు కొట్టాల్సి ఉంది సదరు డ్రైవర్. అయితే ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోలేదు. బస్సు డిపోకు వెళుతోందని మాయమాటలు వల్లించి ప్యాసింజర్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. అలా మార్గమధ్యంలో బస్సు ఆపిన శ్రీనివాస్ తన వక్రబుద్ధిని బయట పెట్టాడు. సదరు మహిళా కండక్టర్‌పై అత్యాచారానికి ప్రయత్నించాడు.

అయితే శ్రీనివాస్ ఒక్కసారిగా అలా ప్రవర్తించడంతో ఆమె కంగారు పడ్డారు. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని సమీపంలోని జైపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయం వివరించారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టెంపరరీ స్టాఫ్‌తో ఆర్టీసీ అధికారులకు తప్పని తిప్పలు

టెంపరరీ స్టాఫ్‌తో ఆర్టీసీ అధికారులకు తప్పని తిప్పలు

తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ అధికారులకు తలనొప్పులు తప్పడం లేదు. రోజు ఏదో ఓ చోట బ్యాడ్ ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో టెంపరరీ సిబ్బందిని ఆగమేఘాల మీద నియమించారు. ఎలాంటి టెస్టులు నిర్వహించకుండానే డ్యూటీ ఎక్కించేశారు. ఆ క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం.. కొందరేమో తప్ప తాగి విధులకు హాజరవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చివరకు వీరి నిర్వాకం అమాయక ప్రజల ప్రాణాలను గాల్లో కలుపుతున్నాయి.

తెలంగాణ ఉద్యమం తలపించేలా చేస్తాం.. సీఎం కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్..!

మద్యం తాగి బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్.. 5 రోజుల శిక్షతో పాటు 2 వేల జరిమానా

మద్యం తాగి బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్.. 5 రోజుల శిక్షతో పాటు 2 వేల జరిమానా

అదలావుంటే సిద్ధిపేట డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేశ్‌.. సిద్దిపేట నుంచి కామారెడ్డి రూట్‌లో బస్సు నడుపుతున్నాడు. అయితే నరేశ్‌ మద్యం సేవించి బస్సు నడపడం గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కామారెడ్డి కోర్టులో హాజరు పరిచారు. దాంతో న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అదనంగా రెండు వేల రూపాయల జరిమానా విధించారు.

English summary
In the view of Telangana RTC Strike many problems occured with temporary staff. One Driver rape attempet on lady conductor in Mancherial District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X