పాము - కోడిపుంచు పోరాటం: కోడి గెలిచింది.. పాము చచ్చింది..!!
సజీవంగా ఉన్న పామును ఓ కోడి పోడిచి,పోడిచి చంపేసింది. కొళ్లు ఉన్న ప్రదేశానికి వచ్చిన పామును చూసిన ఓ పుంజు దానిపై దాడి చేసింది. దీంతో పాము సైతం కోడి నుండి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. నేచురల్‌గా పాము పడగ విప్పి బుసలు కొట్టినా కోడిపుంజు మాత్రం విడిచిపెట్టలేదు. బతుకు జీవుడా అంటూ పారిపోతున్న పామును ముక్కుతో పొడుతూ వెంబడించింది. అయినా పాము తప్పించుకునే ప్రయత్నం చేసినా లాభం లేక పోయింది. సజీవంగా ఉన్న పామునే ముక్కుతో పోడిచి కోడిపుంజు మింగివేసింది.
ఈ సంఘటన మెదక్ జిల్లాలోని శివంపేట మండలం శభాష్పల్లిలో వెలుగు చూసింది. పెరడులో గింజలు బుక్కుతున్న కోళ్లమధ్య చిన్న పాము పిల్ల వచ్చింది. దీంతో దానిపై కోళ్లు దాడి చేశాయి. దీంతో పాము సైతం కోళ్లపై పడగ విప్పింది. దీంతో పామును వెంబడించిన కోళ్లు వెనుదిరిగాయి. కాని ఓ పుంజు మాత్రం పాము పని పట్టింది. నువ్వుంటే మాకేం లెక్క అంటూ పడగ విప్పిన పామును పొడిచి, పొడిచి పరుగులు పెట్టించింది. దీంతో మెడకు చుట్టుకున్న పామును ఒక్కసారిగా కోడిపుంజు మింగివేసింది.
కాగా ఈసంఘటను చూసిన వారు మొబైల్లో బంధించి సోషల్ మీడీయాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతుంది. ఎప్పుడో ఓసారి లభించే వీడియో కావడంతో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.అయితే పామును మింగిన కోడి ఎలా ఉందో అనే కామెంట్స్ కూడ పెడుతున్నారు.