మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగిసిన నగేశ్ కస్టడీ, 4 రోజులు ప్రశ్నల వర్షం.. బినామీలు కూడా విచారణ

|
Google Oneindia TeluguNews

మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ కస్టడీ ముగిసింది. గత 4 రోజులు ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారించారు. బినామీల పాత్రపై క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరుగురు బినామిలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మెదక్‌తోపాటు హైదరాబాద్ శివార్లలో నగేశ్‌కు బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.

నగేశ్ బినామీల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల కోసం తరలించారు. తర్వాత వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై దర్యాప్తు జరుగుతోంది. మెదక్ అదనపు మాజీ కలెక్టర్ నగేష్‌తోపాటు నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి గురువారం వరకు నిందితులను విచారించారు.

 acb custody ended in medak former additional collector nagesh

ఈ కేసులో ఏ1 మాజీ కలెక్టర్ నగేష్, ఏ2 వసీమ్, ఏ3 అరుణా రెడ్డి, ఏ4 అబ్దుల్ సత్తార్, ఏ5 జీవన్ గౌడ్‌లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మాజీ అడిషనల్ కలెక్టర్‌పై వస్తున్న ఆరోపణలను ఏసీబీ మరోసారి విచారణ చేపట్టనుంది. అరెస్టయిన అధికారులను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied

గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్పిలో 112 ఎకరాల పట్టా భూమి ఉంది. అయితే భూమికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను సంప్రదించాడు. అయితే ఇందుకు 1.12 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. రూ.40 లక్షల నగదు కూడా ఇచ్చాడు. అయితే మరో రూ.72 లక్షల కోసం ఐదెకరాల భూమిని తన బినామీ జీవన్ గౌడ్ పేరు మీద అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఆధారాలు సమర్పించడంతో వారు రంగంలోకి దిగి.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

English summary
acb custody ended in medak former additional collector nagesh for 1.12 crore bribe case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X