• search
  • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అభిమానం పీక్.. సోనూ సూద్‌ని హీరో కొట్టాడని ఆగ్రహాం. .

|

కరోనా కాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్ అంటే చాలా క్రేజ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులను దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా తన సేవల కారణంగా అభిమానులను దక్కించుకున్న సోనూ కోసం ఓ ఏడేళ్ల బుడ్డొడు టీవీ పగలగొట్టాడు.

 boy breaks tv after hero hits vilan sonusood at movie

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్​లో ఎస్సీ కాలనీకి చెందిన విరాట్ అనే బాలుడు టీవీలో సినిమా చూస్తున్నాడు. ఓ సినిమా విలన్​గా నటించిన సోనుసూద్‌ని హీరో కొట్టే సీన్ చూడగానే విరాట్​కు కోపం వచ్చింది. కరోనా కష్టకాలంలో తీవ్రంగా కొవిడ్ టైంలో అందరినీ ఆదుకున్న సోనూసూద్ అంకుల్​ని కొడతావా అంటూ బయటి నుంచి రాయి తెచ్చి టీవీని పగలగొట్టాడు.

ఘటన చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. సీన్లు చూసి టీవీని బద్దలు కొడతావా అని అడిగితే సోనూసూద్ అంకుల్‌ని కొడితే ఊరుకోనంటానా? అని అన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను సోనూ సూద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

English summary
boy breaks tv after hero hits vilan sonusood at movie
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X