దుబ్బాకలో బీజేపీ విజయం ..దుమ్ము లేపిన కమలం ... గేరు మార్చలేకపోయిన టీఆర్ఎస్
దుబ్బాక ఉప ఎన్నిక బరిలో భారతీయ జనతా పార్టీ దుమ్మురేపింది. 23 వ రౌండ్ పూర్తయ్యేసరికి 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ విజయం సాధించింది. మొదటి పది రౌండ్స్ ఆధిక్యం ప్రదర్శించిన బిజెపి, తరువాత క్రమంగా డల్ అయింది. ఆ తర్వాత చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకుని బిజేపి విజయాన్ని నమోదు చేసింది .
టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1470 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు.
Dubbaka bypoll results:తెలంగాణాలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే,బీజేపీ నేత మురళీధర్ రావు ట్వీట్

కారు జోరుకు బ్రేక్ వేసిన బీజేపీ
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణా రాష్ట్రంలో మొదటి నుంచి ఆసక్తి కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎదురు లేదని భావించిన అధికార టిఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం షాక్ ఇచ్చింది. జోరుగా దూసుకుపోతున్న కారుకు బ్రేక్ వేసింది. ఈ రోజు ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలైనప్పటి నుండి బీజేపీ అద్దిక్యం కొనసాగింది.

1470 ఓట్ల మెజారిటీతో విజయం
మొదటి పది రౌండ్లలో ఆధిక్యం చూపించిన బీజేపీ 11 నుండి 19 రౌండ్ల వరకు కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. తర్వాత 20వ రౌండ్ నుండి వరుసగా బీజేపీ ఆధిక్యం చూపించింది. మొత్తంగా బిజెపి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 1470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
మన రాష్ట్రంలో ఆదినుంచి ఆసక్తికరంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించింది . అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువ ఉత్కంఠను రేకెత్తించింది .

బీజేపీ సంబరాలు ... గేరు మార్చలేకపోయిన కారు
ఆది నుంచీ కమలం హోరాహోరీగా పోరాటం సాగిస్తూనే టిఆర్ఎస్ పార్టీ కంటే ముందంజలోనే ఉంది.ప్రచారంలో కూడా నువ్వా నేనా అన్నట్టు దూసుకుపోయిన బీజేపీ ఎట్టకేలకు అధికార టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చింది . కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుండి టిఆర్ఎస్ పార్టీ మొత్తం ఓట్ల మీద బీజేపీపై ఆధిక్యాన్ని ప్రదర్శించ లేకపోయింది. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తానికి బిజెపి సాగించిన హోరాహోరీ పోరాటంలో కారు గేరు మార్చ లేకపోయింది. దుబ్బాక నియోజకవర్గం బిజెపి ఖాతాలో చేరింది.