• search
  • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నమ్మకంతో నయవంచన.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. 12 గంటలు రాక్షసక్రీడ

|

జగదేవ్‌పూర్‌ : నమ్మకం పేరుతో వంచిస్తున్నారు మాయగాళ్లు. ప్రేమ పేరుతో వల విసురుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తమను నమ్మి వచ్చే అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఘటన యువత పోకడలకు అద్దం పడుతోంది. 16 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్లీజ్, వదిలేయండంటూ మొత్తుకున్నా కనికరించలేదు. దాదాపు 12 గంటల పాటు రాక్షస క్రీడ కొనసాగించారు.

ఆలయాల్లో ఇంటి దొంగలు.. మొన్న బాసర.. నేడు కొమురెల్లి మల్లన్న బంగారం మాయం

ఇటీవల ఇలాంటి ఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తున్నాయి. గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువకులు అమాయక అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. తమను నమ్మేదాకా గుడ్‌బాయ్‌లా ప్రవర్తిస్తూ తీరా గ్రిప్ దొరికాక విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు.

 రాక్షస మూక గ్యాంగ్ రేప్..!

రాక్షస మూక గ్యాంగ్ రేప్..!

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో దారుణం జరిగింది. రాయవరం గ్రామానికి చెందిన 16 ఏళ్ల దళిత బాలికను ఓ యువకుడు నమ్మించి మోసం చేశాడు. తనతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బుధవారం (15.05.2019) సాయంత్రం బైక్‌పై తీసుకెళ్లాడు. రాజీవ్‌ రహదారి సమీపానికి చేరుకున్న తర్వాత ఇద్దరి ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేశాడు. తీరా వాళ్లు అక్కడికి చేరుకున్నాక.. ముగ్గురూ కలిసి గ్యాంగ్‌రేప్ చేశారు. ఆ తర్వాత సదరు బాలికను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి నరకం చూపించారు.

ప్లీజ్, వదిలేయండి.. 12 గంటల నరక యాతన..!

ప్లీజ్, వదిలేయండి.. 12 గంటల నరక యాతన..!

స్నేహితుడే కదా అని నమ్మి వచ్చిన ఆ బాలికను చిత్రహింసలు పెట్టారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారేదాకా ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు విడిచి ఒకరు అతి దారుణంగా రేప్ చేశారు. ప్లీజ్, నన్ను వదిలేయండంటూ కాళ్లు మొక్కినా కూడా ఆ కర్కశ హృదయులు కనికరించలేదు. నిస్సహాయురాలిగా ఏమి చేయని పరిస్థితిలో బాలిక నరకయాతన అనుభవించింది.

మూర్ఖుల రాక్షసత్వానికి బాధ తట్టుకోలేక ఆ బాలిక కేకలు వేసినా విడిచిపెట్టలేదు. ఒళ్లు వాచేలా కొడుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బుధవారం సాయంత్రం నుంచి దాదాపు 12 గంటల పాటు రాక్షస క్రీడ కొనసాగించిన దుర్మార్గులు.. గురువారం నాడు ఉదయం రాజీవ్‌ రహదారి మీద పడేసి పారిపోయారు.

కేసు నమోదు.. నిందితుల కోసం గాలింపు

కేసు నమోదు.. నిందితుల కోసం గాలింపు

బాలిక కనపడటం లేదని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెతికే పనిలో పడ్డారు. ఆ క్రమంలో రాజీవ్ రహదారి సమీపంలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న బాలిక కనిపించింది. కనీసం నిలబడలేని స్థితిలో సదరు బాలిక కనిపించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకెళ్లి ఆరా తీయడంతో జరిగిన దారుణం గురించి చెప్పుకొచ్చింది. దాంతో జగదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లోనూ అలాంటి దారుణం..!

హైదరాబాద్‌లోనూ అలాంటి దారుణం..!

ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. గంజాయికి అలవాటుపడిన కొందరు యువకులు ఓ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు. బట్టలూడదీసి నగ్నంగా ఆమె ఫోటోలు చిత్రీకరించారు. రాయలేని పదజాలంతో దూషిస్తూ రాక్షాసానందం పొందారు. రాత్రంతా ఆ అమ్మాయికి నరకం చూపించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై బ్లేడుతో కోస్తూ అతి క్రూరంగా ప్రవర్తించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. జనాల్లో చైతన్యం లేకనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Gang Rape came into lime light in siddipet district going hot topic. One Girl Went with his friend on bike, but he cheated and raped with his two friends. Gang Rape held for twelve hours, the girl weaked and they left her on rajiv national highway. Family members found her, and booked a police case against three guys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more