మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?

|
Google Oneindia TeluguNews

రైతుల వద్ద నుంచి కూరగాయాలు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుల వద్ద నుంచి విజిటేబుల్స్ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆయన బుధవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో గల వంటిమామిడి మార్కెట్ యార్డ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్‌కు ఆలుగడ్డలు తీసుకువచ్చిన నెంటూర్ గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామి, బంగ్లా వెంకటాపుర్ చెందిన రైతులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

government ready to buy vegetables at support price cm kcr

ఆలుగడ్డలు ఎంత ధరకు అమ్ముడుబోతున్నాయో అని వారిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వాటికి ఎంత పెట్టుబడి పెట్టారని ఆరా తీశారు. ఆలు గడ్డలకు గిట్టుబాటు ధర ఎంత వస్తుందో అడిగారు. రైతుల సాధక బాధకాలు తెలుసుకుంటామని.. సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. కేసీఆర్ హామీతో రైతుల సంతృప్తి వ్యక్తం చేశారు. కూరగాయల ధరలకు కూడా మద్దతు ధర ఇవ్వాలనుకోవడం గొప్ప విషయం అని అభివర్ణించారు. ఈ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవబోతుందని చెప్పారు.

వరి/ మక్కజొన్న ఇతర పంటలకు మాత్రం మద్దతు ధర రావడం లేదు. కొన్నిసార్లు పంటను కూడా సరిగా కొనుగోలు చేయడం లేదు. పంట చేతికి వచ్చే వరకు రైతులు కళ్లలో వత్తులు వేసుకొని చూసేవారు. తర్వాత పంటను విక్రయించే సమయంలో వారికి బాలారిష్టాలు తప్పడం లేదు. పంట కొనుగోలు చేస్తామని చెప్పి.. తర్వాత మద్దతు ధర ఇవ్వలేదు. దీనిపై రైతులు/ రైతు నేతలు/ ప్రజా సంఘాలు/ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. కానీ సీఎం కేసీఆర్ కొత్తగా కూరగాయాలకు మద్దతు ధర అనే కొత్త పల్లవి అందుకున్నారు.

English summary
government ready to buy vegetables at support price cm kcr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X