మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘మిల్చి మిల్క్’: పాల వ్యాపారంలోకి మంత్రి హరీశ్ సతీమణి, ఇక ఇంటికే స్వచ్చమైన పాలు

|
Google Oneindia TeluguNews

పాల వ్యాపారంలోకి మంత్రి హరీశ్ రావు కుటుంబం అడుగుపెట్టింది. మిల్చి మిల్క్ పేరుతో కొత్త బ్రాండ్ పెట్టారు. మంత్రి హరీశ్ రావు భార్య శ్రీ నిత మిల్చి మిల్క్ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ హెరిటేజ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా హరీశ్ ఫ్యామిలీ కూడా పాల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించింది.

కరోనా వైరస్ ప్రబలుతోన్న ఈ తరుణంలో ప్రతీ ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో కొత్త పాల బ్రాండ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తమ ఇమ్యూనిటీని ప్రతీ ఒక్కరు పెంచుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ నిత అన్నారు. తమ బ్రాండ్ స్వచ్చమైన పాలు, పాత పదార్థాలను అందిస్తోందని వివరించారు. పాల ఉత్పత్తులతో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చని శ్రీనిత తెలిపారు. మిల్చి మిల్క్‌లో పౌష్టికాలు ఉన్నాయని ఆమె వివరించారు. తమ ఉత్పత్తులను వినియోగదారుల ఇంటి వద్దకే అందిస్తామని తెలిపారు. స్వచ్చమైన పాలు, పాల పదార్థాలను సరఫరా చేస్తామని వెల్లడించారు.

minister harish rao wife srinitha started milk business

Recommended Video

Telangana Floods : KTR Announces Rs 25 Crore For Warangal!

మిల్చి మిల్క్ ధరను ఇంకా ప్రకటించలేదు. స్వచ్చమైన పాలను మాత్రమే అందిస్తామని శ్రీ నిత ప్రకటించారు. మార్కెట్‌లో విజయ, హెరిటేజ్, డొడ్ల, తిరుమల, కరీంనగర్ డెయిరీ వంటి బ్రాండ్లు ఉన్నాయి. మరీ వీటిని తట్టుకొని మిల్చి మిల్క్ నిలబడుతుందా..? లేదంటే అధిగమించి మెజార్టీ షేర్ సాధిస్తోందో చూడాలి మరీ.

English summary
telangana minister harish rao wife srinitha started milk business for the name of milchy milk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X