• search
  • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యువతులపై అత్యాచారం.. పోలీస్‌గా ఫోజు కొట్టిన ఆర్ఎంపీ.. చివరకు..!

|

మెదక్ : ఒంటరిగా కనిపించే అమ్మాయిలతో పాటు ప్రేమ జంటలను బెదిరించి యువతులపై అత్యాచారం చేస్తున్న నకిలీ పోలీస్ గుట్టురట్టైంది. పోలీస్ పేరుతో అమాయకులను బెదిరిస్తూ లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న డూప్లికేట్ పోలీస్ కమ్ ఆర్ఎంపీ డాక్టర్ లీలలు వెలుగుచూశాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో సదరు నిందితుడి బండారం బయటపడింది.

వృత్తి ఆర్ఎంపీ.. ప్రవృత్తి నకిలీ పోలీస్..!

వృత్తి ఆర్ఎంపీ.. ప్రవృత్తి నకిలీ పోలీస్..!

మెదక్ జిల్లా కంది మండలం కలివేముల గ్రామంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న గొల్ల శంకరయ్య గలీజు పనులు బయటపడ్డాయి. వైద్యో నారాయణో హరి అంటూ దేవుడి తర్వాత దేవుడిగా భావించే పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ అత్యాచారాలకు పాల్పడుతున్నాడు శంకరయ్య. పోలీస్‌నంటూ ఫోజులు కొడుతూ ఒంటరిగా కనిపించే మహిళలతో పాటు ప్రేమజంటలను బెదిరిస్తూ యువతులపై అత్యాచారాలకు ఒడిగడుతున్నాడు.

అదే క్రమంలో జులై నెల 26వ తేదీన మార్నింగ్ సమయంలో ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ఓడీఎఫ్ ఎస్టేట్‌కు వెళ్లే దారిలోని కందిగేటు దగ్గర ఉండగా.. గొల్ల శంకరయ్య గమనించాడు. పోలీస్‌నంటూ బెదిరించి.. మీకు ఇక్కడేం పనంటూ వారిని నిలదీశాడు. దాంతో ఆ జంట బెదిరిపోయింది. సదరు యువకుడిని కొట్టడమే గాకుండా యువతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతున్నానంటూ ఆమెను తన బైకుపై ఎక్కించుకుని వెళ్లిపోయాడు.

పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. 4 నెలల నుంచి అన్నీ కష్టాలే.. అందుకేనా రాజీనామాలు..!

ప్రేమ జంటను బెదిరించి.. యువతిని తీసుకెళ్లి..!

ప్రేమ జంటను బెదిరించి.. యువతిని తీసుకెళ్లి..!

అలా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రుద్రారం నుంచి మొదలుపెట్టి సదాశివపేట వరకు ఆమెను బైకుపై తిప్పాడు. చివరకు నిజాంపూర్ శివారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు రాత్రి 9 గంటల సమయంలో సదాశివపేటలో వదిలిపెట్టాడు. అప్పటివరకు వారికి సంబంధించిన మొబైల్ ఫోన్లను కూడా తన దగ్గరే పెట్టుకున్న నిందితుడు ఆమెను వదిలిపెట్టే క్రమంలో వాటిని తిరిగి ఇచ్చేశాడు.

ఈ ఘటనపై జులై 28వ తేదీన ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు బాధితురాలు. జరిగిన విషయం చెప్పి కేసు ఫైల్ చేయించారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్చలు చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు నకిలీ పోలీస్ కమ్ ఆర్ఎంపీ డాక్టర్ ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయడమే గాకుండా టెక్నాలజీ వాడుతూ నిందితుడిని పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి టూ వీలర్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

 తీగ లాగితే కదిలిన డొంక.. నకిలీ పోలీస్ గుట్టురట్టు

తీగ లాగితే కదిలిన డొంక.. నకిలీ పోలీస్ గుట్టురట్టు

ఈ కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగితే డొంక కదిలింది. ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న గొల్ల శంకరయ్య మహిళలను, యువతులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒంటరిగా కనపడే మహిళలతో పాటు.. జంటలను బెదిరిస్తూ యువతులపై అత్యాచారాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బాధితులను జన సంచారం లేని ప్రదేశాలకు తీసుకెళ్లి వారి ఫోటోలు, వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరించి అత్యాచారం చేసేవాడని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళితే పరువు పోతుందని బాధితులు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో నిందితుడి ఆటలు ఇన్ని రోజులు సాగాయని చెబుతున్నారు. చివరకు ఈ కేసులో బాధితురాలు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డూప్లికేట్ కమ్ ఆర్ఎంపీ లీలలు వెలుగుచూశాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Golla Sankaraiah, who is an RMP doctor of kalivemula village, Kandi Mandal in Medak district acted as police. Forged by the police, he is accused of raping young girls, threatening love life with lonely women. Duplicate police cum RMP arrested after one victim fearlessly complained to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more