మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గజ్వేల్ ఇలాకాలో టెన్షన్ టెన్షన్.. ఆసుపత్రిలో కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018: ఎన్నికల వేడి.. ఆసుపత్రిలో కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు | Oneindia Telugu

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో ఆదివారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పిస్తూ గజ్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం దగ్గర దీక్షకు సిద్ధమయ్యారు వంటేరు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో వంటేరు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అదుపులోకి తీసుకుంటామని చెప్పి నా కారులో రెండు కోట్లు దొరికాయంటూ కేసు పెడతారమోననే అనుమానం వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీస్ స్టేషన్ లో వంటేరు సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. దీంతో గజ్వేల్ లో ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

 ఆదివారం రాత్రి టెన్షన్ టెన్షన్.. అసలేం జరిగింది

ఆదివారం రాత్రి టెన్షన్ టెన్షన్.. అసలేం జరిగింది

గజ్వేల్ లో విజయం కోసం టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ.. వంటేరు ప్రతాప్ రెడ్డి ఆదివారం రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర దీక్షకు దిగారు. అయితే ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించాలనే ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. తనను చంపుతారంటూ గట్టిగా కేకలు వేస్తూ పోలీస్ జీప్ ఎక్కేందుకు ప్రతాప్ రెడ్డి నిరాకరించారు. అక్కడే ఉన్న ఆయన అనుచరులు కూడా అడ్డుపడ్డారు. వంటేరును ఒంటరిగా ఎక్కడికి తీసుకెళుతున్నారంటూ ప్రశ్నించారు.

ఆసుపత్రిలో వంటేరు.. ఆందోళనలో కార్యకర్తలు

దీంతో చాలాసేపు రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం కనిపించింది. ఎట్టకేలకు వంటేరుతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు సర్దిచెప్పిన పోలీసులు ఆయనను స్టేషన్ కు తరలించారు. అయితే వంటేరు సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.

కల్వకుంట్ల వర్సెస్ వంటేరు.. ప్రతాప్ రెడ్డి ఆరోపణలేంటి?

కల్వకుంట్ల వర్సెస్ వంటేరు.. ప్రతాప్ రెడ్డి ఆరోపణలేంటి?

గజ్వేల్ లో కేసీఆర్ విజయం కోసం టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనేది వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రధాన ఆరోపణ. తనతో పాటు తన సన్నిహితులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దీక్షకు దిగారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో.. కేసీఆర్ ఆదేశాలతోనే మీరు పనిచేస్తున్నారా అంటూ వారిని ప్రశ్నించారు. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న అభ్యర్థిపై ఇలాగేనా ప్రవర్తించేదంటూ ఆయన అనుచరులు అడ్డుకున్నారు.

గజ్వేల్ కు మహాకూటమి నేతలు..!

గజ్వేల్ కు మహాకూటమి నేతలు..!

వంటేరు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు అభిమానులు, అనుచరులు ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఈక్రమంలో అదనపు బలగాలతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో గజ్వేల్ లో ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వంటేరును పరామర్శించేందుకు మహాకూటమి నేతలు సోమవారం గజ్వేల్ కు రానున్నట్లు తెలుస్తోంది.

English summary
The night tension atmosphere prevailed in Gajewal, where TRS chief KCR is contesting. The tense situation arises when Congress candidate Vanteru Pratap Reddy was arrested by police. Vanteru fell into the police station and he was taken to the hospital and healing was given. This is what is going to happen in Gajewal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X