వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దు ఉద్రిక్తతల వేళ... చైనా కంపెనీతో ధోనీ డీల్... ఇదీ ఫ్యాన్స్ రియాక్షన్...

|
Google Oneindia TeluguNews

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ టీమిండియా మాజీ కెప్టెన్,చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఒప్పో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా డీల్ కుదర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
సరిహద్దులో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఐపీఎల్ 13వ సీజన్‌లో చైనాకు చెందిన వివో కంపెనీని దూరం పెట్టిన సంగతి తెలిసిందే. అలాంటిది సైన్యంలో పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ చైనా కంపెనీతో జతకట్టడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.

ఒప్పోతో డీల్... సంతోషంగా ఉందన్న ధోనీ...

ధోనీతో 'బి ది ఇన్ఫనైట్' క్యాంపెయిన్ డీల్‌ను ఒప్పో యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. దీనిపై స్పందించిన ధోనీ... 'ఈ ప్రాజెక్టులో నేనూ ఓ భాగమయ్యేందుకు ఎంతో కుతుహలంతో ఉన్నాను. సరికొత్త ఆవిష్కరణలు,టెక్నాలజీలో ముందు వరుసలో ఉన్న ఒప్పోతో జతకట్టడం చాలా సంతోషంగా ఉంది.' అని పేర్కొన్నాడు. అయితే ధోనీ తీరుపై కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్...

ఓవైపు సరిహద్దు ప్రతిష్ఠంభనలో భారత ఆర్మీ తలమునకలై ఉంటే... సైన్యంలో పారాచూట్ రెజిమెంట్ విభాగంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ చైనా కంపెనీతో జతకట్టడమేంటని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఏడీజీపీఐతో పాటు నార్తర్న్ కమాండ్ ఇదంతా గమనిస్తుందనే భావిస్తున్నానని పేర్కొన్నాడు. 'ధోనీ ఒప్పోని ప్రమోట్ చేస్తున్నాడా..? పాండేజీ దీనిపై క్లారిటీ ఇస్తాడని భావిస్తున్నాను. న్యూస్ పేపర్స్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి.' అని మరో నెటిజెన్ పేర్కొన్నాడు. కొంతమంది నెటిజెన్స్ మాత్రం ధోనీ ఒప్పోకి అంబాసిడర్‌గా వ్యవహరించడంలో తప్పేమీ లేదనట్లుగా కామెంట్ చేశారు. చైనా కంపెనీకి ధోనీ డబ్బులు ఇవ్వట్లేదని... వాళ్లే ధోనీకి డబ్బులు ఇస్తున్నారని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు...

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు...

జూన్ 15న లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనాకు బుద్ది చెప్పేందుకు భారత్ దాదాపు 224 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించింది. జాతీయ భద్రతకు ఆ యాప్స్ నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంతో నిషేధం విధించింది. దీంతో దేశంలో చాలామంది చైనీస్ ప్రొడక్ట్స్‌ను వాడటం మానేయాలని ప్రచారం చేశారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఒప్పో,వివో లాంటి చైనా బ్రాండ్లపై ఎలాంటి నిషేధం విధించలేదు. అయినప్పటికీ తాము అమితంగా అభిమానించే ధోనీ చైనా బ్రాండ్‌తో జతకట్టడం అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది.

English summary
MS Dhoni is all geared up for the Indian Premier League (IPL) 2020 campaign with Chennai Super Kings (CSK) but just days ahead of the season-opener, a piece of interesting news featuring him has surfaced. While the IPL had to say goodbye to Chinese mobile-maker VIVO ahead of the season 13, Dhoni has signed a deal with another smartphone brand from the country, Oppo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X