హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో MTR తెలుగు రుచుల ఫుడ్ ఫెస్టివల్: తెలుగు రాష్ట్రాల వంటకాలను ఆస్వాదించండి

Google Oneindia TeluguNews

మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్) అనే మా సంస్థ ప్రజల టేస్ట్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారు ఇష్టపడే రుచులకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఎంటీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించబడింది. మా సంస్థ ప్రధానంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను అందిస్తోంది. ఉదయం టిఫిన్‌కు కావాల్సిన మిశ్రమాల నుంచి రెడీమేడ్ మీల్స్, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు, స్నాక్స్, శీతల పానీయాలు ప్యాకేజ్డ్ రూపంలో అందిస్తున్నాం. నార్వేకు చెందిన ఓర్ల్కా అనుబంధ సంస్థగా ఎంటీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనసాగుతోంది. 1924లో బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఎంటీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించబడింది. 1984లో ఎంటీఆర్ తన వ్యాపారాలను దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు విస్తరించింది.

హైదరాబాదులో ఎంటీఆర్ ఫుడ్ ఫెస్టివల్

ఇక ఎప్పటిలానే ఎంటీఆర్ ఫుడ్స్ ఈ ఏడాది కూడా ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. తెలుగు రుచులు పేరుతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో జనవరి 18-19వ తేదీల్లో నిర్వహించనున్న ఫుడ్ ఫెస్టివల్‌కు ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో తెలుగు రుచులను టేస్ట్ చేసి ఇంటిల్లపాది ఆనందించండి . ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా ఆరు ప్రాంతాలకు చెందిన వంటకాలను మీకందిస్తున్నాం.

కర్నూలు జిల్లా ఫేమస్ వంటకం ఉగ్గాని..

ప్రసిద్ధి గాంచిన కర్నూలు రుచులు టేస్ట్ చేయండి. కర్నూలు జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఉగ్గాని, పచ్చిపచ్చడి, బ్యాల్ల పులుసుతో పాటు మరిన్ని వంటకాలను రుచి చూసే అవకాశాన్ని ఎంటీఆర్‌ కల్పిస్తోంది. బుడంకాయ పచ్చడి, అప్పటికప్పుడు వేసే వేడివేడి అలసంద వడలు, బంగాళదుంప వేపుడులాంటి టేస్టీ వంటకాలు ఇక్కడ తయారవుతాయి. ఇక ఆరోగ్యానికి ఎంతో మంచిదైన రాగిసంగటి, రాయలసీమ పచ్చి మిరపకాయ పచ్చడి ఇక్కడ మీకోసం సిద్ధమవుతాయి. భోజనం మెనూలో అరిక బియ్యం, గోంగూర పప్పు, అలసంద చారు సిద్ధంగా ఉంటుంది.

ప్రకాశం జిల్లా స్పెషల్ మెనూ

ప్రకాశం జిల్లా వంటకాలు కూడా ఫుడ్ ఫెస్టివల్‌లో లభిస్తాయి .అల్లం పచ్చిడితో పెసరట్టు, చింత చారు, మదుపు కారం, ఆవకాయ పచ్చడి, పండు మిరిపకాయ పచ్చడి కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ఉంటాయి. ఇక అతిథులకు అప్పుడే వేడివేడిగా పెసరట్టు వడ్డించడం జరుగుతుంది. ఇక భోజనం మెనూ చూస్తే స్ట్రీమ్డ్ రైస్‌తో పాటు మెంతి కూరా పప్పు, మజ్జిగ పులుసు, బెండకాయ వేపుడు వంటి వంటకాలున్నాయి.

కృష్ణా జిల్లా వంటకాలు...

ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో కృష్ణా జిల్లా డిషెస్ కూడా భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. పునుగులు, దిబ్బరొట్టె, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చి మిర్చి పచ్చళ్లు నోరూరించేలా ఉన్నాయి. ఇక భోజనం మెనూలో స్ట్రీమ్డ్ రైస్‌తో పాటు దప్పలం, చామదుంప బెల్లం పులుసు కూరలు సిద్ధంగా ఉంటాయి. అంతేకాకుండా ఉలవచారు వంకాయ పచ్చి మిర్చి కూరలు సైతం నోరూరిస్తాయి. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ రుచులను ఆస్వాదించాలంటే టికెట్లు బుక్ చేసుకోండి.

ఎంటీఆర్ ఫుడ్ ఫెస్టివల్‌ టికెట్స్ ఇలా బుక్ చేసుకోవాలి

పేర్లు చెప్పగానే నోరూరించే ఈ తెలుగు వంటకాలను టేస్ట్ చేయాలంటే నేరుగా బుక్‌ మై షోకు లాగిన్ అయి అక్కడ నుంచి టికెట్లను బుక్ చేసుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటకాలను ఆస్వాదించండి. మధ్యాహ్న భోజనం ఉదయం 11: 30 నుంచి ప్రారంభం కానుండగా రాత్రి భోజనం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం అవుతుంది. మధ్యలో స్నాక్స్, టిఫిన్స్ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో దొరుకుతాయి. ఈ వంటకాలన్నీ కేవలం రూ.400 కే అందిస్తోంది ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X