• search
 • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

143 మంది, 11 ఏళ్లుగా.. 5 వేలసార్లు లైంగికదాడి.. నటులు, యాంకర్లు కూడా, 42 పేజీల ఎఫ్ఐఆర్..

|

భాగ్యనగర నడిబొడ్డున దారుణం వెలుగుచూసింది. ఓ అభాగ్యురాలిపై ఏళ్లుగా లైంగికదాడి చేస్తోన్న ఘటన విస్తుగొలిపింది. చివరికీ ఆ మహిళ స్వచ్చంద సేవా సంస్థ అండతో పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. మొత్తం 143 మంది తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నది. వారి పేర్లను కూడా రాసివ్వడంతో.. ఎఫ్ఐఆర్ కాపీ 42 పేజీలకు చేరింది. ఆ ఘోరకలి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

మైనర్ బాలికకు వివాహం.. ఏడాదికే విడాకులు

మైనర్ బాలికకు వివాహం.. ఏడాదికే విడాకులు

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలేనికి చెందిన మహిళ తన గోడును వెల్లబోసుకుంది. మైనర్‌గా ఉండగానే 2009లో మిర్యాలగూడకు చెందిన కే రమేశ్ అనే వ్యక్తితో పెళ్లి చేశారని తెలిపింది. దీంతో ఆమెకు కష్టాలు స్వాగతం పలికాయి. భర్త గాక ఆడపడుచు, అత్త, మామ, సోదరులు.. బంధువులు 20 మంది వరకు వేధించారు. సూటి పోటీ మాటలతోపాటు లైంగికంగా కూడా వేధింపులకు గురిచేశారు. 9 నెలల గడిచిన తర్వాత విషయాన్ని తన తల్లికి చెప్పడంతో మరుసటి ఏడాది భర్త నుంచి విడాకులు తీసుకుంది. తిరిగి పుట్టింటికి చేరి.. అక్కడ చదువుకుంటోంది.

చదువుకుంటుండగా.. ఉద్యోగం పేరుతో వల...

చదువుకుంటుండగా.. ఉద్యోగం పేరుతో వల...

హైదరాబాద్ చేరి చదువు కొనసాగిస్తోండగా మళ్లీ సమస్యల సుడిగుండంలో చేరింది. తమ వసతి గృహనికి సుమన్ అనే వక్తి వచ్చాడని మహిళ తెలిపింది. ఉద్యోగం ఇస్తానని చెప్పి.. లైంగికదాడి చేశాడని పేర్కొన్నది. తర్వాత అతని స్నేహితులు కూడా రేప్ చేశారని వాపోయింది. తనపై లైంగికదాడి చేసిన వారిలో కొందరు సినీనటులు, మాజీ నేత పీఏ కూడా ఉన్నారని వివరించింది. వారు తనతో నగ్నంగా నృత్యాలు చేయించారని.. మద్యం తాగించి వీడియోలు కూడా తీశారని నిట్టూర్చింది. తన జీవితం ఇలా అయ్యేందుకు కారణమైన సుమన్ సెక్స్ రాకెట్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపింది.

11 ఏళ్లలో 5 వేల సార్లు లైంగికదాడులు..

11 ఏళ్లలో 5 వేల సార్లు లైంగికదాడులు..


గత 11 ఏళ్లలో వారు తనను వివిధ ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి లైంగికదాడి చేశారని వాపోయింది. వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా 5 వేల సార్లు అత్యాచారం చేశారని బోరున విలపించింది. లైంగికదాడి చేసిన 138 మంది పేర్లను తన ఫిర్యాదులో యువతి రాసింది. లైంగికదాడి చేసే సమయంలో తీసిన ఫొటోలు, నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారని యువతి బోరున ఏడ్చింది. చెప్పినట్టు వినకపోతేచంపేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరించేవారని విలపించింది.

  Australia Cricketer Cameron White Retirement | IPL లో RCB, SRH కి ఆడిన వైట్ || Oneindia Telugu
  అబార్షన్ చేయించి.. వేధింపులు

  అబార్షన్ చేయించి.. వేధింపులు


  ప్రెగ్నెంట్ కావడంతో అబార్షన్ కూడా చేయించారని మహిళ వివరించింది. తనను బెదిరించిన వారితో ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. వారి ఆగడాలు భరించలేక గాడ్‌ పవర్‌ ఫౌండేషన్‌ సంస్థను కలిశానని తెలిపింది. వారి సహకారంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో 42 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వాంగ్మూలం నమోదు చేశామని పోలీసులు తెలిపారు. యువతిపై లైంగికదాడి చేసిన వారిపై నిర్భయం, ఐసీపీ 376, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

  English summary
  143 people in hyderabad raped a women in 11 years. woman complained punjagutta police station.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X