నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

22 మందికి కరోనా వైరస్..వారంతా ఓకే ఫ్యామిలీ.. ఎలా సోకిందంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ టెన్షన్ నెలకొంది. ఆ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కేసులు ఒకే కుటుంబంలో ఎక్కువమందికి సోకింది. 20 మందికి పైగా కరోనా సోకడంతో కలకలం నెలకొంది. అసలే స్ట్రెయిన్ ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీ ఫ్యామిలీకి కరోనా సోకడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

Recommended Video

New Coronavirus Strain : భారత్ లో కొత్త కరోనా వైరస్ లేదు - కేంద్ర ఆరోగ్య శాఖ

ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఒక ఫ్యామిలీ ఉంటోంది. దాదాపు 38 మంది కలిసే ఉంటున్నారు. ఇటీవల వారు ఓ టౌన్ షిప్‌లో అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత కరోనా అనుమానంతో అందరూ పరీక్ష చేయించుకున్నారు. అందులో 22 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో కలకలం నెలకొంది. వారిలో 16 మందికి మాత్రమే నెగిటివ్ వచ్చింది. మెజార్టీ మెంబర్స్‌కు కరోనా వైరస్ నిర్ధారణ జరిగింది. వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

22 family members infected corona virus

ఇటు దేశంలో స్ట్రెయిన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 10 ల్యాబులలో స్ట్రెయిన్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు స్ట్రెయిన్ కేసులు 29కి పెరిగాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇదివరకు 25 ఉండగా.. ఇవాళ మరో నలుగురికి నిర్ధారణ జరిగింది. వారిలో తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులు ఉన్నాయి. ఇదివరకు 2 కేసులు ఉండగా.. ఇవాళ మరో కేసుతో అదీ మూడుకి పెరిగింది.

English summary
22 family members infected corona virus in suryapet town. they are recently gone to cremation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X