నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడు ఫీట్ల మంత్రి చేయంది..మూడు ఫీట్ల మంత్రి చేశాడు : సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హుజుర్‌నగర్‌లో బహిరంగ సభలో పాల్గోన్న సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్దికి వరాలు జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ కాలం నుండి హుజుర్‌నగర్‌లో ఎక్కడ వేసిన గోంగలి అక్కడే ఉందని అన్నారు. ఈసంధర్భంగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఆయన తిప్పి కొట్టారు.

మంత్రి జగదీశ్ రెడ్డిని ప్రశంసించిన కేసీఆర్

మంత్రి జగదీశ్ రెడ్డిని ప్రశంసించిన కేసీఆర్

ఈ నేపథ్యంలోనే మంత్రి జగదీశ్ రెడ్డిని మూడు ఫీట్లు ఉన్నాడని, ఆయన ఏం అభివృద్ది చేస్తాడని ప్రతిపక్షాలు విమర్శించారని... అయితే ఏడు ఫీట్లు ఉన్న మంత్రులు చేయలేని పనిని మూడు ఫీట్లు ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డి చేసి చూపించాడని చెప్పారు. ఇందులో భాగంగానే మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నీళ్లను నల్గోండకు తీసుకువచ్చాడని అన్నారు.

నాగార్జున సాగర్ కాలువల అభివృద్ది

నాగార్జున సాగర్ కాలువల అభివృద్ది


హూజుర్ నగర్ నుండి నాగార్జున సాగర్ వరకు ఆయనే స్వయంగా పర్యటిస్తానని సీఎం చెప్పారు. రైతులకు కావల్సిన లిఫ్టులు ఏర్పాటు చేసి, ప్రతి కాలువను అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు నాగార్జున సాగర్ కాలువ వెంట స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పరీశీలించాలని ఆయన ఆదేశించారు.. దీన్ని నవంబర్ లోనే ప్రారంభించాలని కోరారు. అవసరమైతే తానే కుర్చి వేసుకుని కూర్చుని పనులు చేయిస్తానని చెప్పారు. మరోవైపు లిప్టుల నిర్వాహాణను ప్రభుత్వమే చేపడుతుందని, అందులో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించి, రైతులకు ప్రతి అంగుళం నీటీని అందిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతి అంగుళానికి నీరు

రాష్ట్రంలో ప్రతి అంగుళానికి నీరు

పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని సీఎం మరోసారి చెప్పారు, ఒక్కసారి చెప్పినమంటే దాన్ని చేసి చూపిస్తామని అన్నారు. ఈ సంధర్భంగా తెలంగాణలో ఉన్న కోటి ఇరవై అయిదు లక్షల ఎకరాలకు నీళ్లు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యాక్రమాలతో పాటు రైతుల అభివృద్దికి చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్న కేసీఆర్ వెంట ఉండి బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

English summary
Telangana cm kcr participates at huzurnagar public meeting on saturday. and announced crores of rupees for constiuency development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X