నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాములుగా లేదుగా.. చెట్టుపై బీటెక్ విద్యార్థి బస, పాజిటివ్ రావడంతో..

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వింత వింత అనుభవాలు కూడా వస్తున్నాయి. పాజిటివ్ వస్తే 14 రోజులు తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాల్సిందేననే సంగతి తెలిసిందే. అయితే కొందరికీ ఇంట్లో వసతులు ఉండవు. అలాంటి వారికి ఇబ్బందులు తప్పవు. బయటకు వెళదామని అనుకున్న ఎవరూ ఆహ్వానించరు. కోవిడ్ కేర్ సెంటర్ ఉన్నా.. చాలా మట్టుకు నగదు పే చేయాల్సిందే. అయితే రెండు ఘటనలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒకతను బాత్రూంనే బెడ్ రూంగా మార్చివేశారు. మరొకరు చెట్టుపై బస ఏర్పాటు చేసుకున్నారు.

చెట్టుపై బస

చెట్టుపై బస


నల్గొండ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకిన ఓ బీటెక్ విద్యార్థి చెట్టుపై నివాసం ఏర్పరచుకున్నాడు. అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివానాయక్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. కరోనా వల్ల తరగతులు నిలిచిపోవడంతో గత కొన్నినెలలుగా గ్రామంలోనే ఉంటున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకింది.

ధాన్యం విక్రయించిన తర్వాత..

ధాన్యం విక్రయించిన తర్వాత..

ఇటీవలే శివనాయక్ స్థానిక ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. ఆ తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో కరోనా టెస్టు చేయించగా, పాజిటివ్ వచ్చింది. తమ ఇంట్లో ఉన్నది ఒకే గది కావడంతో ఐసోలేషన్‌లో ఉండేందుకు తన ఇంటి సమీపంలోని చెట్టునే ఆవాసంగా మలుచుకున్నాడు. చెట్టుపై మంచాన్ని గట్టిగా తాళ్లతో కట్టి దానిపైనే విశ్రమిస్తూ ఐసోలేషన్‌లో గడుపుతున్నాడు. గత తొమ్మిది రోజులుగా ఇదే విధంగా చెట్టుపైనే శివానాయక్ మకాం ఉంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

ముమ్మాటికీ కరెక్టే

ముమ్మాటికీ కరెక్టే

వాస్తవానికి శివనాయక్ చేస్తున్నది కరెక్ట్. వైరస్ గాలి ద్వారా కూడా సోకుతున్న ఈ తరుణంలో.. మంచి నిర్ణయమే తీసుకున్నారు. చాలా మంది అతను చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు. వైరస్ జయించి.. చెట్ట మీద నుంచి కిందకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Recommended Video

Ys Jagan యాక్షన్ కి లోకేష్ రియాక్షన్ | విద్యార్థుల భవిష్యత్తుకి సీఎం భరోసా || Oneindia Telugu

English summary
after tested corona positive btech student shifted upon a tree for isolation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X