నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్‌కే మద్దతు... కాసేపట్లో అధికారిక ప్రకటన : నారాయణ

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరన్నారు సిపిఐ నేత నారయణ, ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ మద్దతుపై చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన మరికాసెపట్లో అధికారింగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. కాగా పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. తాను సైతం జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కట్డుపడి పని చేస్తానని తెలిపారు.

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం దాదాపుగా ఖారారైనట్టు తెలుస్తోంది. మద్దతుతో పాటు ఇతర అంశాలపై ఉదయం సమావేశమైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తుందని సిపిఐ నేత నారయణ తెలిపారు. చర్చలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్‌ మద్దతు అంశంపై అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలోనే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.

cpi will announce official support for trs

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అటు అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం సిపిఐ మద్దతు కోరిన నేపథ్యంలోనే చర్చలు కొనసాగుతున్నాయి. కాగా సిపిఐ గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కోరిన స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించిందనే అభిప్రాయంలో పార్టీ నేతలు ఉన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే ధోరణి అవలంబించారని కాంగ్రెస్ పార్టీ తీరుపై రాష్ట్ర పార్టీ నేతలు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.

English summary
cpi going to announce officially support for trs party in huzurnagar by-elections. cpi leader narayana siad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X