నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌లో ముదురుతున్న హుజుర్‌నగర్ వివాదం, రేవంత్ రెడ్డి సలహలు అవసరం లేదన్న ఎంపీ కోమటిరెడ్డి

|
Google Oneindia TeluguNews

హూజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కొమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హుజుర్‌నగర్ అభ్యర్ధిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్తగా వచ్చిన వారి సలహలు, సూచనలు అవసరం లేదని రేవంత్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. హూజుర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్ భార్య,అయిన పద్మావతి రెడ్డిపై పార్టీలో ఏకాభిప్రాయం ఉందని అన్నారు.

హుజుర్ నోటిఫికేష్ ముందే కాంగ్రెస్‌లో విభేదాలు

హుజుర్ నోటిఫికేష్ ముందే కాంగ్రెస్‌లో విభేదాలు

హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు బయటపడుతున్నాయి. అభ్యర్థి కోసం ఉత్తమ్ మరియు రేవంత్ రెడ్డిల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఉత్తమ్‌కు కోమటి రెడ్డి మద్దతుగా

ఉత్తమ్‌కు కోమటి రెడ్డి మద్దతుగా

తాజాగా ఉత్తమ్‌కు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే హుజుర్‌నగర్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చేసిన ప్రకటనపై ఎంపీ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అనుమతి లేకుండా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్ధి పేరును ఎలా ప్రకటిస్తాడని ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆయన మరో పేరును సూచించారు. పార్టీకి సేవ చేసిన చామా కిరణ్ రెడ్డికి అభ్యర్థిత్వంపై ఆయన మొగ్గుచూపారు.

 రేవంత్ రెడ్డి ప్రకటించిన అభ్యర్ధి నాకే తెలియదు

రేవంత్ రెడ్డి ప్రకటించిన అభ్యర్ధి నాకే తెలియదు


దీంతో రేవంత్ రెడ్డిని ఎదుర్కోనేందుకు ప్రత్యర్ధులుగా ఉన్న ఎంపీ కొమటి రెడ్డి వెంకట్ రెడ్డితోపాటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరియు జానారెడ్డిలు ఏకమయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ కొమటి రెడ్డి పద్మావతి అభ్యర్ధిత్వాన్ని అంగీకరించారు. అమేపై పార్టీలో ఏకాభిప్రాయం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం పార్టీలోకి వచ్చిన వారు పార్టీ సీనియర్లుగా ఉన్న, మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అసలు రేవంత్ రెడ్డి ప్రకటించిన వ్యక్తి తనకే తేలియదని అన్నారు. ఇక ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు

పీసీసీ పగ్గాలు నాకే కోమటి రెడ్డి

పీసీసీ పగ్గాలు నాకే కోమటి రెడ్డి

మరోవైపు పీసీసీ పగ్గాలపై కోమటిరెడ్డి స్పందించారు. పీసీసీ పగ్గాలను రేవంత్ రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం కొనసాగుతోండగా, అలాంటీ ఎమీ లేదని పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అయిన ఆర్‌సి కుంతియా కూడ ప్రకటించారు. అయితే ఉత్తమ్ తర్వాత పీసీసీ పగ్గాలు నాకే అప్పగిస్తారంటూ కోమటి రెడ్డి అన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నామని చెప్పిన ఆయన పాత తరం నాయకులు మొత్తం తనకు మద్దతుగా ఉన్నారని అన్నారు. దీంతోపాటు ఏఐసీసీ నాయకుల మద్దతు కూడ ఉందని అన్నారు.

English summary
MP KomatiReddy Venkatreddy agreed Padmavati reddy as Huzur Nagar's assembly candidate ,and he said that don not need Revanth Reddy's advice in the selection of the candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X