నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

video:డీఎస్పీ కారు ఢీ, డిక్కీలో వేసి తీసుకెళ్లి మరీ.. సీరియస్

|
Google Oneindia TeluguNews

పోలీసు అంటే అంతే.. ఇక లా అండ్ ఆర్డర్ అంటే చెప్పక్కర్లేదు. ఖాకీ యూనిఫాం ఉంటే అన్నీ మరచిపోతారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతున్నారు. కానీ కొన్నిచోట్ల అలా కనిపించడం లేదు. అవును నిన్న జరిగిన ప్రమాదం చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ఆ వీడియోను మీరు చూడండి. అతని తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

 రూల్స్ బ్రేక్..

రూల్స్ బ్రేక్..

దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు.. రూల్స్‌కు మినహాయింపు అన్నట్టు వ్యవహరించారు. అవును నిన్న సాయంత్రం ఆయన వాహనం మునుగోడు వెళుతుంది. అయితే యాదాద్రి జిల్లా రామన్నపేట మండం జనంపల్లికి చెందిన సంగిశెటి ధనుంజయ ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఆయన మునుగోడు మీదుగా చండూరు వెళుతున్నారు. అయితే బోడంగిపర్తి శివారులో టర్నింగ్ వద్ద ధనుంజయ వాహనాన్ని డీఎస్పీ కారు ఢీకొట్టింది. ఆ సమయంలో డీఎస్పీ వాహనం ఓవర్ స్పీడ్‌తో ఉంది.

డీఎస్పీ కారు ఢీ

డీఎస్పీ కారు ఢీ


టూ వీలర్‌ను కారు ఢీ కొనగా ఆయన ఎగిరిపడ్డాడు. టూవీలర్ నుజ్జు నుజ్జయ్యింది. ధనుంజయకు తీవ్రగాయాలు అయ్యాయి. ఏదో యాక్సిడెంట్ అనుకోవచ్చు.. ఆ తర్వాత కూడా డీఎస్పీ, పోలీసుల ప్రవర్తన అమానవీయంగా ఉంది. ప్రమాదానికి గురయిన వ్యక్తిని అంబులెన్స్‌లో తీసుకెళ్లలేదు. పోలీసు వాహనం వెనక సీట్లో కూర్చొబెట్టిన బాగుండేది. కానీ అతనిని డిక్కీలో వెసుకెళ్లారు. అదీ కూడా 25 కిలోమీటర్లు.. కనీసం.. ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు. రక్తం కారుతున్న ఆ ఖాకీల మనసు మాత్రం కరగలేదు.

సర్కార్ దవాఖానలో వేసి


నల్గొండ సర్కార్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లో గల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారట. ఈ విషయాన్ని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డీఎస్పీ అక్కడినుంచి వెళ్లిపోయారు. మిగిలిన ఖాకీలు ఏం పట్టనట్టు బీహెవ్ చేశారు. ఆ వీడియోలో వారి తీరు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

English summary
dsp nageshwar rao vehicle hit two wheeler dhanunjaya. incident happened at munugodu, two wheeler situation is serious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X