• search
  • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సంధర్బంగా ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన చౌటుప్పల్ వృద్దులు

|

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా హెల్పేజ్ ఇండియా సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న మొబైల్ హెల్త్ కేర్ యూనిట్ సిబ్బందీ మరియు ఆ యూనిట్ ద్వారా లబ్దిపొందుతున్న వయో వృద్ధులంతా గురువారం రెవిన్యూ డివిజినల్ అధికారిని కలిశారు .ప్రస్తుతం వయో వృద్దులు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి వివరించారు .చట్టపరమైన హక్కుల గురించి ,వాటిని వృద్దులైన తాము పొందేందుకు తగిన చర్యలు తీసుకోవడం గురించి అధికారిని కోరుతూ మెమోరాండం ను ప్రాజెక్టు ఆఫీసర్ కాశి గోవింద రాజు సమక్షంలో అందజేశారు.

మొమోరాండంతో పాటు యాదాద్రి వయో వృద్ధుల మహా సమాఖ్య చౌటుప్పల్ సంఘమునకు స్థలము కేటాయించి కార్యాలయం నిర్మించాల్సిందిగా రెవిన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. మొబైల్ హెల్త్ కేర్ యూనిట్ తో పాటు స్వయం ఉపాధి ప్రాజెక్ట్ లో భాగమైన వృద్దుల స్వయం సహాయక బృందాల సభ్యులు కూడా ఉపాధి, వృద్దులకు రుణాలకు సంబంధించి వారి డిమాండ్లను డివిజినల్ అధికారి వారికి వివరించారు.ఈ కార్యక్రమములో మొబైల్ హెల్త్ కేర్ యూనిట్ ద్వారా లబ్ది పొందుతున్న వృద్ధులూ , యాదాద్రి వయోవృద్ధుల మహాసమాఖ్య , చౌటుప్పల్ మండల అధ్యక్షుడు ఆకుల శంకరయ్య, కార్యదర్శి గుర్రం కిష్టయ్య, మిరియాల అంజయ్య , సిలివేరు వీరయ్య, ఉప్పు వీరయ్య, తోట మల్లయ్య మరియూ పోచంపల్లి వృద్ధుల సంఘాల అధ్యక్షుడు లక్ష్మయ్య, వజ్రమ్మ,పోచంపల్లి ప్రాజెక్టు ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మండలం కోయల గూడెం, చిన్నకొండూరు, మసీదు గూడెం గ్రామాలలోనూ, పోచంపల్లి మండలంలోని గ్రామాలలోనూ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్బంగా వివిధ కార్యక్రమాలను కూడా చేపట్టారు.

Help age India:Old age People meet RDO and explain the problems on International day for old persons

కరోనా వైరస్ ఈ భూగోళం మీద సృష్టించిన అలజడి అందరికీ తెలిసిందే. కొన్ని దేశాల జీవన వ్యవస్థను దెబ్బతీస్తూ కొన్ని నెలలుగా కొరోనా వైరస్ అనేక దేశాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ప్రపంచానికి కరోనా వైరస్ మీదా, దాని ఉనికి మీదా ఒక అవగాహన వచ్చి జాగ్రత్త పడేసమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది. మన భారతదేశం కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు ప్రపంచం వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఎంతో నిబద్దతతో పనిచేసాయి. వాటికి తోడు ఎన్నో ప్రయివేటు సంస్థలూ, కార్పొరేట్ సంస్థలూ, స్వచ్ఛంద సంస్థలూ నిర్విరామంగా పనిచేసాయి. ప్రజలను కాపాడటంలో తమవంతు న్యాయం నూటికి నూరుశాతమూ చేశాయి. ఈ వైరస్ పిల్లలకూ , వృద్ధులకూ, ఎక్కువగా ప్రబలుతుండడం వల్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిస్సహాయ వృద్ధులను ఆదుకోవడానికి ముందుకొచ్చాయి. అందులో ప్రధమంగా నిలిచినవి హెల్పేజ్ ఇండియా స్వచ్చంద సంస్థ యొక్క ఉచిత సంచార వాహనాలు

Help age India:Old age People meet RDO and explain the problems on International day for old persons

మొబైల్ హెల్త్కేర్ యూనిట్స్ : గ్రామీణ భారతదేశం లోనూ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనూ వృద్దులకు వైద్యసేవలందించేందుకు ఉచిత సంచార వాహనాలను హెల్పేజ్ ఇండియా కొన్నేళ్ళక్రితం ప్రవేశపెట్టింది. వీటిలో సంస్థ సిబ్బంది ఎంపిక చేసుకున్న గ్రామాలలో అంటే ఆరోగ్య వసతులూ, ఇతర వైద్య సంబంధిత వసతులూ తక్కువగా ఉన్న గ్రామాలలోరోజూ తిరుగుతూ వివిధ రకాల వైద్య సేవలు అందిస్తారు. రక్తపోటు, మధుమేహము లాంటి రోగాలకు ఉచిత పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేస్తారు. దివ్యాంగులైన వృద్దులకు వీల్ చైర్లూ, ఇతర కిట్లనూ పంపిణీ చేస్తారు. వైద్య సేవలు మాత్రమే కాకుండా అనేక వ్యాధులకు సంబందించిన విషయాల పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వృద్దులకు అవగహన కల్పించి వారు తగుజాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటారు. పూర్తి వికలాంగులైన వృద్దులకు నేరుగా ఇంటికి వెళ్లి హోమ్ విజిట్ ద్వారా వారి పరిస్థితిని తెలుసుకుని వైద్యం అందిస్తారు. అత్యవసర వైద్య సహాయం అవసరం అయితే సమీప ఆసుపత్రులలో చికిత్స కోసం సంస్థ తరపున అభ్యర్ధనలు పంపి చికిత్స జరిపిస్తారు. వృద్దులకు అందాల్సిన అనేక ప్రభుత్వ పధకాల పట్ల అవగాహన కల్పించి అర్హులైన వారికి వాటిని పొందే క్రమంలో పూర్తి సహాయస హకారాలు అందజేస్తారు.

Help age India:Old age People meet RDO and explain the problems on International day for old persons

English summary
Old age people who are being benifitted through mobile health care unit organised by Help age india, met the RDO Suraj Kumar and explained the problems that they are facing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X