నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుజూర్ నగర్ నీదా..? నాదా..? రాజకీయ పార్టీల మద్య నెలకొన్న తీవ్ర పోటీ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక సెగలు రేపుతోంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని రాజకీయ పార్టీ వ్యాహాత్మంగా పావులు కదుపుతున్నాయి. అదికార గులాబీ పార్టీ తో పాటు కాంగ్రెస్ పార్టీ మద్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా తన సత్తా చాటుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం కేంద్ర మంత్రులను రంగంలోకి దించి, తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పథకాలు, విడుదల చేసిన నిధుల గురించి చెప్పించబోతున్నారు బీజేపి స్ధానిక నేతలు. దీంతో హుజుర్ నగర్ ఉప పోరులో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఉత్కంఠ పోటీ..! గెలుపుకోసం తీవ్ర కసరత్తు చేస్తున్న పార్టీలు..!!

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఉత్కంఠ పోటీ..! గెలుపుకోసం తీవ్ర కసరత్తు చేస్తున్న పార్టీలు..!!

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని అదికార గులాబీ పార్టీ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతిలో స్వల్ప తేడాతో ఓడినపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని కృతినిశ్చయంతో ఉన్నట్టుతెలుస్తోంది. అందుకోసం హుజూర్ నగర్ ఉప పోరు బాద్యతలను సీఎం చంద్రశేకర్ రావు పార్టీ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి అప్పగించారు. దీంతో నియోజక వర్గంలో మకాం వేసిన పల్లా గెలుపు ఓటములపై కసరత్తు చేస్తున్నారు. అంతే కాకుండా పార్టీ లోని కీలక నేతలతో ప్రచారం చేయించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు పల్లా.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అదికార పార్టీ..! ప్రచారానికి రానున్న సీఎం..!!

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అదికార పార్టీ..! ప్రచారానికి రానున్న సీఎం..!!

అంతే కాకుండా వచ్చే నెల 21న ఎన్నిక జరుగనుండగా అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. అదికార గులాబీ పార్టీ మాత్రం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దసరా పండగ తర్వాత ప్రచారాన్ని మరింత ఉదృతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ప్రచారాని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును ఒకరోజు ఆహ్వానించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. అంతే కాకుండా మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లను కూడా ప్రచారంలో దించాలని టీఆర్ఎస్ సమాలోచనలు జరుపుతోంది.

కాంగ్రెస్ గెలుపు బాద్యత రేవంత్ రెడ్డిదే..! కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి భరోసా కూడా అదే..!!

కాంగ్రెస్ గెలుపు బాద్యత రేవంత్ రెడ్డిదే..! కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి భరోసా కూడా అదే..!!

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గెలుసుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్ధానం ఐనప్పటికి అదికార గులాబీ పార్టీ నుండి గట్టి పోటీ ఉండడంతో అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రచారానికి ఢిల్లీ నుండి గులాంనబీ ఆజాద్ తో పాటు మరికొంత మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. స్ధానికంగా రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తే సమీకరణాలు మారిపోతాయనే ప్రచారం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ది ఉత్తమ్ పద్మావతి కూడా అత్యంత సన్నిహితుల వద్ద ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఉన్నికలో కాంగ్రెస్ పార్టీ తరుపున రేవంత్ రెడ్డి ప్రచారం కీలకం కానుందనే భావనను పద్మావతి వ్యక్తం చేస్తున్నారు.

రంగంలో కి అనూహ్యంగా బీజేపి..! నెలకొన్న త్రిముఖ పోటీ..!!

రంగంలో కి అనూహ్యంగా బీజేపి..! నెలకొన్న త్రిముఖ పోటీ..!!

ఇదిలా ఉండాగా భారతీయ జనతా పార్టీ కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపి అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకోవడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపయినట్టు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాలని పావులుకదుపుతోంది బీజేపి. కేంద్ర హోంమంత్రి అమీత్ షా, పార్టీ జాతీయ కార్యనిర్వహాక అద్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డా, ప్రకాశ్ జావదేకర్ తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికల రసవత్తంగా మారే అవకావాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం, తెలంగాణ జన సమితితో పాటు వామపక్ష పార్టీలు అభ్యర్దిని రంగంలో దించుతారా..?లేక ఇతర పార్టీలకు మద్దత్తు ఇస్తారా అనే అంశం పై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మద్య సంకుల సమరాన్ని తలపించబోతున్నట్టు తెలుస్తోంది.

English summary
The by-election of Huzur nagar is under the heading. All political parties are in a passion to win in the by-election anyway. Apart from the sporadic pink party, the Congress party is likely to have a fierce competition. In addition, the Bharatiya Janata Party also plans to make its debut. This is likely to be a three-pronged contest in the Huzur Nagar by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X