• search
  • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ అమ్మాయి ప్రేమ కోసం .. సినీఫక్కీలో ఇద్దరు యువకుల ఘర్షణ .. ఒకరు బలి

|

17 ఏళ్ల యువకుడిలో హింసాప్రవృత్తిని ప్రజ్వలింపజేసింది ప్రేమ. కత్తి వాడటం మొదలెడితే నా కంటే బాగా ఎవరు వాడలేరని సినిమా డైలాగులు వంటపట్టించుకున్నాడో ఏమో కానీ ప్రేమించిన అమ్మాయి కోసం ఘర్షణ పడి ఒకరి ప్రాణాలు తీశాడు. మరికొంతమంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేశాడు. కనీసం 18ఏళ్లు కూడా నిండని ప్రాయంలోనే హింసాత్మక ప్రవృత్తిని అలవర్చుకున్న ఓ యువకుడి ప్రేమ అతడ్ని కటకటాల పాలు చేసింది.

అమ్మాయి కోసం సినీ ఫక్కీలో ఘర్షణ .. విచాక్షణారహితంగా దాడి

అమ్మాయి కోసం సినీ ఫక్కీలో ఘర్షణ .. విచాక్షణారహితంగా దాడి

నల్గొండ జిల్లా కనగల్ మండలం దొరెపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన సమాజంలో ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసింది. ఇటీవల దొరెపల్లి గ్రామంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించగా, మరికొందరు గాయాల పాలయ్యారు. అయితే విద్యార్థుల మధ్య ఘర్షణ కు కారణం ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. సినీఫక్కీలో సాగిన ఈ ప్రేమ వ్యవహారం, ఘర్షణ వివరాల్లోకి వెళితే లక్ష్మణ్ అనే యువకుడు వరుసకు మరదలు అయిన అమ్మాయితో చనువుగా ఉండేవాడు. అయితే అదే అమ్మాయితో ప్రవీణ్ అనే యువకుడు కొంత కాలం గా చనువుగా ఉంటూ ప్రేమించానని చెప్పాడు. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడం తో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ప్రవీణ్ ని ఎలాగైనా మందలించాలని, తాను ప్రేమించిన అమ్మాయి జోలికి రావద్దని హెచ్చరించాలని భావించిన లక్ష్మణ్ అతని సోదరుడు చందూతో కలిసి ప్రవీణ్ ను హెచ్చరించడానికి వెళ్లారు. రోడ్డుపైన తారసపడిన ప్రవీణ్ కు, లక్ష్మణ్ , చందు లతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రవీణ్ తన దగ్గర ఉన్న కత్తితో లక్ష్మణ్ ఛాతీలో పొడిచాడు. చందు పైన కూడా దాడి చేసిన ప్రవీణ్ కడుపులో, వీపు క్రింద కింద భాగంలో పొడిచాడు. దీంతో చందు కడుపులో పేగులు బయటకు వచ్చాయి. ఈ దాడిలో లక్ష్మణ్ మరణించగా, చందు పరిస్థితి విషమంగా మారింది. ఘర్షణ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న శివాజీ, శ్రీధర్ లపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు ప్రవీణ్. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రవీణ్ హింసాత్మక ప్రవృత్తి కి నిదర్శనం

ప్రవీణ్ హింసాత్మక ప్రవృత్తి కి నిదర్శనం

ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇంత హింసాత్మకంగా ప్రవర్తించిన ప్రవీణ్ తీరు అందరినీ షాక్ కి గురి చేసినా నేటి సమాజంలో ఈ విధమైన హింసాప్రవృత్తి యువతలో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇక ప్రవీణ్ విషయానికొస్తే కత్తి పట్టుకుని ఫోటోలు దిగడం, పెద్ద పెద్ద కత్తులతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం, కత్తి పట్టుకుని తిరగడం వంటివి చేస్తూ ఉండేవాడు. సినిమాల ప్రభావమో, మరే ప్రభావమో తెలియదు కానీ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని యువకుడు ప్రవీణ్ ఈ విధంగా నేర ప్రవృత్తికి అలవాటు పడడం శోచనీయం. ఒకరి ప్రాణాలు అవలీలగా తీసి, మరి కొందరిని ఆస్పత్రి పాలు చేసిన ప్రవీణ్ ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్ధి తన భవిష్యత్ పాడు చేసుకున్నాడు. లక్ష్మణ్ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. చందుని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేశాడు. ఈ వ్యవహారంతో సంబంధంలేని వారిని సైతం గాయాల పాలు చేశాడు .

తల్లిదండ్రులు పారాహుషార్ .. పిల్లలపై పెట్టండి నజర్

తల్లిదండ్రులు పారాహుషార్ .. పిల్లలపై పెట్టండి నజర్

తల్లిదండ్రులు పట్టించుకోకుంటే ప్రవీణ్ లానే ఎందరో యువకుల బంగారు భవిష్యత్తు నాశనమై పోయే ప్రమాదముంది. మరెందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయే అవకాశము ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే పిల్లల ప్రవర్తన పై తల్లిదండ్రుల నిఘా ఎప్పటికీ ఉండాలి. వారి ప్రవర్తన ఎప్పటికీ గమనించాలి. వారిలో నేర ప్రవృత్తి గమనిస్తే సరైన మార్గంలో మరల్చేలా కౌన్సిలింగ్ ఇప్పించాలి. సమాజానికి హానికరంగా మారకుండా జాగ్రత్త పడాలి.

లేకుంటే వారి జీవితమే కాదు మరెందరి జీవితాలనో నాశనం చేసే ప్రమాదం వుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Love affair lead to a brutal murder in Telangana.Two teenagers fought for a girl In Nalgonda district DorePalli village. in that fight 17 year old Praveen allegedly took a steak knife and fatally stabbed Laxman who also love the girl. Laxman dead in the fight . Praveen attacked on Chandu and two others were in hospital.police arrested Praveen and investigating the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more