నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి ప్రాణ హాని... మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ...

|
Google Oneindia TeluguNews

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆరోపిస్తూ బంటు మణెమ్మ అనే మహిళ గురువారం(సెప్టెంబర్ 24) హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు బనాయించి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు.

నెల్లూరులో మహిళ దారుణ హత్య... డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెళ్లిన దుండగులు...నెల్లూరులో మహిళ దారుణ హత్య... డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెళ్లిన దుండగులు...

మిర్యాలగూడలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారని... ఎమ్మెల్యే కూడా వారితో చేతులు కలిపి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తన భర్త బుచ్చిబాబు లాయర్ అని... ఆయన బాధితుల తరుపున వాదిస్తున్నందుకు ఎమ్మెల్యే తమపై కక్ష కట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మిర్యాలగూడ టౌన్‌ పోలీసులు కుమ్మక్కై తమను వేధిస్తున్నారని... వారి నుంచి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఒత్తిడితో మిర్యాలగూడ పోలీసులు తమ ఇంట్లోకి చొరబడి ముఖ్యమైన ఫైళ్లు, కాగితాలు, పాస్‌ పుస్తకాలు, దస్తావేజులతో పాటుగా కీలకమైన పత్రాలను లాక్కెళ్లారని చెప్పారు.

 miryalaguda mla bhaskar rao harassing my family woman complaints to hrc in hyderabad

తన భర్త,కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే,పోలీసుల వేధింపులతో తమ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని... ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న మిర్యాలగూడ పోలీసులు,ఎమ్మెల్యే భాస్కరరావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు.

Recommended Video

RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu

మరోవైపు మణెమ్మ ఆరోపణలను ఎమ్మెల్యే భాస్కర రావు ఖండించినట్లు తెలుస్తోంది. రాజకీయ దురుద్దేశంతో తన ప్రత్యర్థులే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని భాస్కరరావు ఆరోపించినట్లు సమాచారం.

English summary
Bantu Manemma,a Miryalaguda woman approached Human Rights Commission in Hyderabad and complainted against TRS MLA Bhaskar Rao.She alleged that MLA and local police have been harassing her family from last few months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X