• search
 • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోకిరోడి వీపు పగిలింది.. వివాహితకు వేధింపులు.. కర్రతో కుళ్లబొడిచారుగా..! (వీడియో)

|
  పోకిరిని కర్రతో కుళ్లబొడిచారుగా..! || Roadside Romeo Tied To Tree And Hurted By Couple || Oneindia

  నల్గొండ : ఆకతాయి పోరడికి తగిన శాస్తి జరిగింది. పోకిరోడి వీపు పగిలింది. వివాహితను వేధించిన ఘటనలో చావు దెబ్బలు తిన్నాడు. సదరు మహిళ తనలోని కోపాన్ని కర్రతో చూపించింది. చెట్టుకు కట్టేసి వీరబాదుడు బాదారు. జీవితంలో మరోసారి అలాంటి తప్పు చేయకుండా కర్రతో కుళ్లబొడిచారు. తాను మనిషిననే విచక్షణ మరిచిపోయి వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బడితె పూజ ఓ రేంజ్‌లో జరిగింది. వీపు విమానం మోత మోగడంతో అమ్మో అయ్యా అప్పా అంటూ కేకలు పెట్టిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది.

  నల్గొండ టౌన్ ఆర్జాలబావికి చెందిన శ్రీశైలం అనే యువకుడు అదే కాలనీకి చెందిన ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. పనీపాటా ఏదీ లేని ఆకతాయిగా తిరిగే శ్రీశైలం కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. దాంతో సహనం నశించి చివరకు విషయం కాస్తా భర్తకు చెప్పింది. అయితే ఎప్పటిలాగే తన డ్యూటీ లాగా మరోసారి ఆమెకు సైగలు చేస్తున్న క్రమంలో సదరు యువకుడిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి వీపు విమానం మోత మోగించారు. జీవితంలో మరోసారి పర స్త్రీల వైపు కన్నెత్తి చూడకుండా బాగానే కోటింగ్ ఇచ్చారు.

  nalgonda youngster beaten by married woman for misbehave

  జులాయిగా తిరిగే శ్రీశైలం తనను వేధిస్తుండటం పట్ల ఆమె తీవ్రంగా కలత చెందింది. ఆ క్రమంలో అతగాడు పట్టుబడటంతో భర్త సాయంతో చెట్టుకు కట్టేశారు. కర్ర చేతబట్టుకుని తన కోపమంతా వెళ్లగక్కారు. ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. కర్రతో, చెప్పుతో వీరబాదుడు బాదడంతో అమ్మో అయ్యో అంటూ అరిచాడు. ఆ దెబ్బలు తాళలేక తాను ఎంత పెద్ద తప్పు చేశాడో గుర్తొచ్చినట్టుంది.

  ఈటల తూటాలు.. సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ పుట్టించారుగా..!

  వివాహితను వేధిస్తున్న క్రమంలో ఆమె సహనం పాటించింది. పోనీలే, ఇంట్లో చెబితే గొడవ జరుగుతుందని భావించారు. అయితే అదే అలుసుగా తీసుకున్న శ్రీశైలం.. ఆమె తనను ఏమనట్లేదని ఫీలయ్యాడో ఏమో గానీ మరింత రెచ్చిపోయాడు. ఆమె కనిపించినప్పుడల్లా పిచ్చి పిచ్చి సైగలు చేసి ఇబ్బంది పెట్టేవాడు. చివరకు వాడి వేధింపులు ఎక్కువ కావడంతో విషయం కాస్తా భర్తకు చెప్పారు. ఆ క్రమంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోకిరోడి వీపు పగిలింది. చివరకు నల్గొండ రూరల్ పోలీసులకు అప్పజెప్పడంతో కేసు బుక్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  One youngster beaten by woman in Nalgonda is Going Hot Topic. He tortured that woman and misbehave. At last she told to her husband, they caught him red handed and beaten.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more