• search
  • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చనిపోయిన వ్యక్తి కుటుంబానికి మోసమా? టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేశంను నిలదీస్తున్న గ్రామం

|

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? సంక్షేమ పథకాలతో ఓట్లు రాలతాయనుకున్న ఆ పార్టీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయా? వివాదాలకు కేంద్రబిందువులుగా మారిన తాజా మాజీలకు మళ్లీ టికెట్లివ్వడం ప్రజలకు రుచించడం లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో గులాబీ నేతలకు ఎదురవుతున్న పరిణామాలే సజీవ సాక్ష్యాలు.

టీఆర్ఎస్ కు చెందిన నకిరేకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఆరోపణలకు కొదువ లేదన్నది బహిరంగ రహస్యం. ఎప్పుడూ ఏదో వివాదంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. తన మాట వినకుంటే రౌడీయిజానికి దిగుతారనే కథనాలు కొకొల్లలు. ఈనేపథ్యంలో ఆయన ప్రచారానికి రాకుండా చిట్యాల మండలం నేరడ గ్రామస్థులు అడ్డుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ధైర్యం లేదా? ప్రచారానికి పోలీసులెందుకు?

ధైర్యం లేదా? ప్రచారానికి పోలీసులెందుకు?

నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వేముల వీరేశం ప్రచారపర్వం ఉద్రిక్తతకు దారితీసింది. చిట్యాల మండలం నేరడకు వస్తున్నారని తెలియడంతో ఆయన్ని గ్రామంలోకి రానివ్వకుండా స్థానికులు తీర్మానించారు. అయితే వేముల వీరేశం రావడానికి ముందుగా పోలీస్ బలగాలు గ్రామంలోకి రావడంతో స్థానికులకు కోపం తెప్పించింది. అంతేకాదు ఒంటరిగా వచ్చే ధైర్యం లేకనే పోలీసులను ముందుగా పంపించారని మండిపడ్డారు.

 ఏంటీ కథ? ఊళ్లోకి ఎందుకు రావొద్దంటున్నారు

ఏంటీ కథ? ఊళ్లోకి ఎందుకు రావొద్దంటున్నారు

నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక సతీష్ రెడ్డి, నర్సిరెడ్డి సోదరులకు రాజకీయ నేతలుగా మంచి పేరుంది. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరిద్దరు తదనంతర కాలంలో గులాబీ గూటికి చేరారు. అయితే 2014 ఎన్నికల సమయంలో వేముల వీరేశంకు దుబ్బాక సతీష్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తే చివరకు మోసం చేశారనేది గ్రామస్థుల ప్రధాన ఆరోపణ. వీరేశంకు 30 లక్షల రూపాయలు సతీష్ రెడ్డి ఇచ్చారని.. అవి తిరిగి ఇస్తానంటూ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడుతున్నారు.

గతేడాది సతీష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కుటుంబానికి డబ్బులు చెల్లిస్తానంటూ చెప్పి చివరకు వీరేశం బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ప్రచారానికి గ్రామంలోకి వస్తున్నారనే సమాచారంతో.. చనిపోయిన సతీష్ రెడ్డి పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గ్రామస్థులు. "నాకు ఇవ్వవలసిన 30 లక్షల రూపాయలు మా కుటుంబ సభ్యులకు చెల్లించు వీరేశం అన్న" అనేది దాని సారాంశం. అంతేకాదు చనిపోయిన ఓ మంచి వ్యక్తి కుటుంబాన్ని మోసం చేయాలనుకోవడం భావ్యం కాదని మండిపడుతున్నారు.

వ్యతిరేకత ఒకవైపు.. అనుచరుల సపోర్ట్ మరోవైపు

వ్యతిరేకత ఒకవైపు.. అనుచరుల సపోర్ట్ మరోవైపు

వేముల వీరేశం ప్రచారానికి మొదటినుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనపై వ్యతిరేకత బాగానే ఉన్నట్లు చాలానే వార్తలొచ్చాయి. తాజాగా నేరడ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే ఆయనపై ఎంతటి వ్యతిరేకత ఉందో చూసేవారికి ఇట్టే అర్థమవుతుంది. అయితే

ఒక వ్యక్తి కోసం గ్రామస్థులంతా ఏకతాటిపై నిలబడటం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది.

అదలావుంటే నేరడ గ్రామస్థుల తీరును తప్పుబడుతున్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు. నల్లగొండ టీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి దుబ్బాక సతీష్ రెడ్డి సోదరుడు నర్సింహరెడ్డిని తప్పించి కంచర్ల భూపాల్ రెడ్డికి అప్పగించడంలో వేముల వీరేశం పాత్ర లేదని చెబుతున్నారు. ఇందులో వీరేశం పాత్ర ఉందనే అపోహతో నేరడ గ్రామస్థులు ఇలా చేయడం సరికాదంటున్నారు. ఒకవేళ సతీష్ రెడ్డి వాస్తవంగా వీరేశంకు డబ్బులు ఇచ్చినట్లైతే.. కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు.

గులాబీ

గులాబీ "ముళ్లు"

అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు "గులాబీ ముళ్లు" బాగానే గుచ్చుకుంటున్నాయి. పోయిన టర్మ్ లో ఏం అభివృద్ధి చేశారంటూ చాలాచోట్ల అభ్యర్థులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయితే కొన్నిచోట్ల సిట్టింగులపై ఆరోపణలు, ఫిర్యాదులు అందినా కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. వారికి టికెట్లివ్వొద్దనే సూచనలు పరిగణనలోకి తీసుకోలేదు.

ఆరోపణల చిట్టాలో వేముల వీరేశం పేరు కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయినా కూడా కేసీఆర్ వీరేశంకు టికెటిచ్చారు. అయితే ఎన్నికల వేళ ప్రజా వ్యతిరేకతను మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. అదలావుంటే ఆరోపణలొచ్చిన కొందరికి గులాబీ బాస్ టికెట్లివ్వకపోవడం కొసమెరుపు.

English summary
The TRS candidate from Nakrekal assembly segment led to the tensions in the election campaign. The locals decided not to come into the village. The main allegation that Dubbaka Satish Reddy given support to vemula veeresham in 2014 election, But veeresham cheated satish reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X