నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూచ్.. తూచ్.. మీ నర్సింహయ్య వాయిస్ మిమిక్రే.. మిత్రుల కోసమే, కొండల్ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య ఆడియో కలకలం రేపింది. తాను చివరి క్షణంలో కమ్యూనిస్ట్ పార్టీని గుర్తుచేసుకున్నారు. అయితే దీనిని కుటుంబసభ్యులు ఖండించారు. దీంతో మిమిక్రీ ఆర్టిస్ట్ కొండల్ తెరపైకి వచ్చారు. ఆ వాయిస్ తానే చేశానని.. గ్రూపులో కొందరి కోసం సరదాగా చేస్తే వైరల్ చేశారని వివరించారు. నర్సింహయ్య కుటుంబసభ్యులకు క్షమాపణ చేశారు. వైరల్ చేసిన వారిపై విరుచుకుపడ్డారు. సరదా కోసం చేస్తే.. వాడుకోవడం తగదని చెప్పారు.

ఏముంది అంటే..

ఏముంది అంటే..

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అంటూ ఫేక్ ఆడియో మొదలవుతోంది. అందులో నోముల నర్సింహయ్య భారత కమ్యూనిస్ట్ మార్కిస్ట్ బిడ్డలు, కామ్రేడ్ కళాకారులు అంటూ మొదలుపెడతారు. విప్లవవాది కళాభివందనాలు అంటూ ఆడియో ఉంది. తాను ఎర్రజెండా నర్సింహయ్య అంటూ చెప్పుకున్నారు. తనను భగవంతుడు పిలిచాడని.. అంతిమ సంస్కరాలను కూడా కమ్యూనిస్ట్ సిద్దాంతాలకు అనుగుణంగా చేయాలని కోరారు. అంతేకాదు తాను ఎర్రజెండా బిడ్డగానే సాగనంపాలని విన్నవించారు.

ఇవే చివరి మాటలు..

ఇవే చివరి మాటలు..

అందులో ఇవే చివరి మాటలు అనడంతో కాస్త సందేహాం కలిగింది. దాంతోపాటు కమ్యూనిస్ట్ రాజ్యాలు ఏర్పడుతాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. ఇలా కామెంట్ చేయడం ఏంటీ అనే చర్చ జరిగింది. ఎవరినైనా ఇబ్బంది పెట్టొచ్చు.. వ్యక్తులు, శక్తులు, వ్యవస్థల ద్వారా అన్యధగా భావించొద్దు అన్నారు. తాను నోముల బిడ్డగా.. నర్రా రాఘవరెడ్డి శిష్యుడిగా ఉంటానని చెప్పారు.

ఫ్యామిలీ రియాక్షన్

ఫ్యామిలీ రియాక్షన్

ఆడియోపై నోముల ఫ్యామిలీ వెంటనే స్పందించింది. ఆ ఆడియో క్లిప్పింగ్స్ ఫేక్ అని స్పష్టంచేసింది. కొంతమంది దురుద్దేశంతో క్ ఆడియా సృష్టించారని నర్సింహయ్య బావమరిది సాదం సంపత్ కుమార్, కుటుంబ సభ్యులు స్పష్టంచేశారు. ఆ వెంటనే మిమిక్రీ ఆర్టిస్ట్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఆడియో తానే చేశానని.. సరదాగా చేశానని చెప్పారు.

మిత్రుల కోసం మిమిక్రీ

మిత్రుల కోసం మిమిక్రీ

తమ గ్రూపులో మిత్రుల కోసం మిమిక్రీ చేశానని చెప్పారు. తాను నరసింహయ్యతో కలిసి పనిచేశానని వివరించారు. నరసింహయ్య అంటే అభిమానంతో చేశానని తెలిపారు. కానీ కొందరు వైరల్ చేయడం సరికాదన్నారు. ఓ న్యూస్ చానెల్ పేరును కూడా ప్రస్తావించారు. ఇదీ చాలా దుర్మార్గం అని చెప్పారు. నరసింహయ్య కుటుంబసభ్యులకు ఆడియోలో క్షమాపణ చెప్పారు.

English summary
nomula narasimhaiah voice mimicry artist kondal said in another audio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X