నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఖిలప్రియ పైన సొంత తమ్ముడు కేసు: ఆస్తి వివాదంలో కోర్టుకు: పంపకాల వివాదంలో..!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి అఖిల ప్రియ పైన సొంత తమ్ముడు కేసు దాఖలు చేసారు. భూమా నాగిరెడ్డికి ముగ్గురు సంతానం. హైదారాబాద్ నగర శివార్లలోని ఒక భూమికి సంబంధించిన వ్యవహారంలో తన ఇద్దరు అక్కలతో పాటుగా తనకూ వాటా రావాలంటూ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ కేసు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ నెల 14న ఆయన కేసు దాఖలు చేసారని సమాచారం. ఇప్పటికే తన భర్త మీద నమోదైన కేసుల పైన అఖిల ఆందోళనతో ఉన్నారు. ఇక, రాజకీయంగా తన వర్గం మీద కేసులు పెడుతున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో సొంత సోదరుడు కేసు దాఖలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇది భూమా నాగిరెడ్డి ఉన్న సమయంలోనే విక్రయించిన ఆస్తిగా చెబుతున్నారు. కానీ, అప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి మైనర్ కావటంతో అతని వేలి ముద్రలను తీసుకొని ఆస్తిని విక్రయించారు. ఇప్పుడు దీని మీద కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.

 హాని జరిగితే ఎస్పీదే బాధ్యత... వేధింపులపై రాష్ట్రపతిని కలుస్తా : మాజీ మంత్రి అఖిల ప్రియ హాని జరిగితే ఎస్పీదే బాధ్యత... వేధింపులపై రాష్ట్రపతిని కలుస్తా : మాజీ మంత్రి అఖిల ప్రియ

అఖిల పైన తమ్ముడు కేసు

అఖిల పైన తమ్ముడు కేసు

మాజీ మంత్రి అఖిలప్రియ పైన సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని గండిపేట సమీపంలో భూమా నాగిరెడ్డి తనకు ఉన్న స్థలాన్ని ముగ్గురు పిల్లలకు రాసారు. దీనిని 2016లో విక్రయించారు. ఆ సమయంలో స్థలంలో వాటాదార్లుగా ఉన్న భూమా అఖిల ప్రియ..మౌనిక సంతకాలు చేసారు. అయితే, అప్పుడు మైనర్ గా ఉన్న జగన్ విఖ్యాత్ రెడ్డి వేలి ముద్రలు వేసారు. ఇక, ఆ విషయం అప్పట్లో ముగిసిపోయింది. అయితే, తిరిగి ఇప్పుడు కారణం ఏంటనేది తెలియకపోయినా..జగన్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసారు. తన అక్కలతో పాటుగా ఆ ఆస్తిలో తనకు వాటా రావాలని కోర్టులో దాఖలు చేసిన పిటీషలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

తాను మైనర్ కావటంతో తెలియకుండా..

తాను మైనర్ కావటంతో తెలియకుండా..

తాను మైనర్ గా ఉన్న సమయంలో అంతగా వాటి గురించి తెలియకపోవటంతో వేలి ముద్రలు వేసానంటూ జగత్ విఖ్యాత్ రెడ్డి పిటీషన్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే, జగన్ తన కేసును కుటుంబంలో బంధుత్వం ఉన్న వ్యక్తి ద్వారా వేయించటంతో ఇప్పుడు ఇది కొత్త చర్చకు కారణమవుతోంది. తన ఇద్దరు అక్కలు ఆ స్థలం అమ్మకంలో వచ్చిన వాటాలు తీసుకున్నారని..తన వాటా ఇప్పిచాలంటూ తన అక్కల తో పాటుగా స్థలం కొనుగోలు దారుడిని సైతం ప్రతివాదిగా చేర్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ మండలం గండిపేట ప్రాంతంలోని సర్వే నెంబర్ 192 లోని ఒక స్థలం వివాదంలో పిటీషనలో వివరాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మొన్న భర్త మీద.. ఇప్పుడు ఈ కేసు

మొన్న భర్త మీద.. ఇప్పుడు ఈ కేసు

అఖిల ప్రియ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయంగా అక్కడ అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో అఖిల భర్త మీద ఒక కేసు నమోదైంది. ఇక, రాజకీయంగా తన అనుచరులను అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారంటూ అఖిల ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో సొంత కుటుంబలోని సొంత తమ్ముడు కేసు దాఖలు చేయటం చర్చకు కారణమైంది. భూమా నాగిరెడ్డి మరణం సమయం నుండి నంద్యాల ఉప ఎన్నిక వేళ..అదే విధంగా తాజాగా జరిగిన ఎన్నికల వరకూ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి తన అక్కలకు మద్దతుగా పని చేసాడు. ఇప్పుడు ఈ కేసు వ్యవహారం వెలుగులోకి రావటంతో రాజకీయంగా కర్నూలు జిల్లాలో పేరున్న భూమా వారసుల మధ్య ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.

Recommended Video

బీజేపీ లో చేరేందుకు సిద్దమైన అఖిల‌ప్రియ || Bhuma Akhila Priya And His Brother All Set To Join In BJP
నా తమ్ముడు నాతోనే...

నా తమ్ముడు నాతోనే...

ఇప్పుదు జగత్ విఖ్యాత్ రెడ్డి అక్క మీద కేసు వేసారనే ప్రచారం పైన అఖిల స్పందించారు. తన తమ్ముడు తనతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. తాము ముంబాయిలో ఉన్నామని పేర్కొన్నారు. తమ మధ్య విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేసారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ ఇప్పుడు భూమా కుటుంబ వారసులుగా అఖిల ప్రియ మొత్తాన్ని కుటుంబ పరంగా..ఆళ్లగడ్డ..నంద్యాలలో పార్టీని లీడ్ చేస్తున్నారు. తన తండ్రితో కలిసి పని చేసిన కొందరు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నా..కొనసాగుతున్నారు. ఇక, ఇప్పుడు ఈ తాజా వ్యవహారం జిల్లా తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది.

English summary
Court case filed against ex minister Bhuma Akhila Priya by her own borhter Jagath Vikyath Reddy in Rangareddy district court. On his share in land sale he approached court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X