• search
  • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కోమటిరెడ్డి ప్లాన్‌కు పోలీసులు బ్రేక్.. హైకోర్టును ఆశ్రయిస్తానంటూ సవాల్..!

|

నల్గొండ : కాంగ్రెస్ మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన కోసం ఆయన తలపెట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వంపై వత్తిడి పెంచి ప్రాజెక్టు పూర్తి చేయించాలనే తలంపుతో బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర తలపెట్టిన కోమటిరెడ్డి ప్లాన్ చివరకు పోలీసుల రూపంలో అడ్డంకిగా మారింది. అయితే ఆరు నూరైనా ప్రాజెక్టు సాధన కోసం కృషి చేస్తానంటున్నారు కోమటిరెడ్డి. కోర్టును ఆశ్రయించి పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు.

పాదయాత్రకు సిద్ధం.. పోలీసుల బ్రేక్

పాదయాత్రకు సిద్ధం.. పోలీసుల బ్రేక్

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ప్రభుత్వం దిగొచ్చేలా బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టాలని డిసైడయ్యారు. ఈ నెల 26 నుంచి 29 వరకు ఉదయ సముద్రం - బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన రైతు పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆ మేరకు డీజీపీతో పాటు స్థానిక ఎస్పీకి ఈ నెల 19వ తేదీన దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే కోమటిరెడ్డి తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు పోలీసులు.

అమెజాన్ అడవుల్లో మంటలు ఆర్పుతూ.. యుద్ద విమానాలతో నీళ్లు చల్లుతూ..!

పర్మిషన్ ఇవ్వలేదు.. ఆయనకు నోటీసులు కూడా ఇచ్చాం..!

పర్మిషన్ ఇవ్వలేదు.. ఆయనకు నోటీసులు కూడా ఇచ్చాం..!

బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర తలపెట్టిన కారణంగా అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు తేల్చి చెప్పారు. జాతీయ రహదారి వెంట పాదయాత్ర చేస్తున్నందున తనకు భద్రత కల్పిస్తూ అనుమతి ఇవ్వాలంటూ కోమటిరెడ్డి జిల్లా ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే వినాయకచవితి నేపథ్యంలో బందోబస్తు కోసం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో పర్మిషన్ కుదరదనేది పోలీసుల వెర్షన్.

ఇదివరకు జాతీయ రహదారిపై జరిగిన సంఘటనలు దృష్ట్యా.. కోమటిరెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ ఎస్పీ రంగనాథ్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు.

ఇదివరకు కూడా ర్యాలీలు తీసి ఇబ్బందులు స‌ృష్టించారు..!

ఇదివరకు కూడా ర్యాలీలు తీసి ఇబ్బందులు స‌ృష్టించారు..!

పాదయాత్రకు మార్గం సుగమం - ప్రజాపోరుకు సిద్ధం కండి అంటూ వాల్ పోస్టర్‌ విడుదల చేయడంతో కొంత ఆందోళన చెలరేగినట్లు పోలీసులు చెబుతున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని కొందరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్లు తెలిపారు. రూల్స్ ప్రకారం 5 నుంచి 10 మందితో కలిసి పాదయాత్ర చేసేందుకు వినతి పత్రం సమర్పిస్తే ఆ మేరకు సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు.

గతంలో కోమటిరెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారనేది పోలీసుల వాదన. 2014లో ఎలక్షన్స్ సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని.. అలాగే 2015లో పోలీస్ పర్మిషన్ లేకుండా బైక్ ర్యాలీ తీశారని.. 2018లో కూడా ఇలాగే అనుమతులు లేకుండా రెండు మూడు సార్లు బైక్ ర్యాలీ తీసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. అదే క్రమంలో ఆయన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదంటూ వివరించారు.

కోమటిరెడ్డి వెర్షన్ ఇలా..!

కోమటిరెడ్డి వెర్షన్ ఇలా..!

పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ నిరాకరించడంపై కోమటిరెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. తాను చేపట్టిన పాదయాత్రను అణిచివేయడం సరికాదని.. ఆ క్రమంలో హైకోర్టును ఆశ్రయించి పాదయాత్ర చేసి తీరుతానని సవాల్ విసిరారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని వచ్చి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన కోసం రైతు పాదయాత్ర చేసి తీరుతానంటూ స్పష్టం చేయడం గమనార్హం.

English summary
Former Congress minister and Bhuvanagiri MP Komatireddy Venkatareddy has been hit by a police break. He was refused permission to undertake the padayatra for Brahmana Vellamla project. The Komatireddy plan, which began on a journey from Brahmana Vellamla to Hyderabad with a view to pressurizing the government and completing the project, eventually became an obstacle in the form of police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more