నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: లంచ్ కోసం పోలింగ్ బూత్ మూసేశారు, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : తాళం వేసి బువ్వకెళ్ళిన సిబ్బంది.. ఓటర్ల పడిగాపులు..!

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో పోలింగ్ సిబ్బంది పోలింగ్ బూత్‌ను మూసేసింది. లంచ్ టైమ్ అయిందంటూ వారు పోలింగ్ బూత్‌ను ముశారు. ఇది కలకలం రేపుతోంది. పోలింగ్ సిబ్బంది నిర్వాకంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు తమ సోషల్ మీడియా ప్లాట్ పాంలపై పోస్ట్ చేశారు.

ఇందుకు సంబంధించి పలువురు ఓటర్లు ఫోటోలు తీసి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేశారు. దీనిపై పలువురు ఓటర్లు స్పందిస్తూ... ఇక్కడ చేసిన ఏర్పాట్లు బాగానే ఉన్నాయని, ఉదయం కాస్త ఇబ్బందులు పడ్డామని, కానీ పోలింగ్ బూత్ మూసివేయడం ఇబ్బందిని కలిగించిందని కొందరు చెబుతున్నారు.

Polling booth closed for Lunch in Nalgonda district

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. మధ్యాహ్నం ఒకటి గంటల నాటికి దాదాపు 49 శాతం పోలింగ్ నమోదయింది. రెండు గంటల సమయానికి దాదాపు యాభై శాతం దాటి పోయింది.119 నియోజకవర్గాలకు కాను 106 చోట్ల సాయంత్రం ఐదు గంటలకు, మిగతా 13 మావోయిస్టు ప్రభావ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది.

పోలింగ్ పెరగడం శుభపరిణామం అని సీఈవో రజత్ కుమార్ చెప్పారు. పోలింగ్ బూత్‌లలో విద్యుత్ సమస్య ఉందని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కానీ అది విద్యుత్ సమస్య కాదని, ఎక్కువ వెలుతురు ఉంటే వీవీప్యాట్‌లో సాంకేతిక సమస్యలు వస్తాయని ముందే లైటింగ్ తగ్గించారని చెప్పారు. అలాగే వంశీచంద్ రెడ్డి పైన దాడి ఘటన తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. దీనిపై దర్యాఫ్తు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. పోలింగ్ బూత్‌లో సెల్ఫీ దిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్వోను ఆదేశించామన్నారు.

English summary
Polling booth closed for Lunch in Nalgonda district's Thungathurdy polling booth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X