నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుజుర్‌నగర్ అభ్యర్థిగా పద్మావతిరెడ్డి , ప్రకటించిన సోనియా గాంధీ.. రేవంత్‌రెడ్డికి షాక్

|
Google Oneindia TeluguNews

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఖారారు చేసింది. దీంతో తెలంగాణ కాంగ్రస్ పార్టీలో రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. కాగా కొద్దిరోజుల క్రితమే పద్మావతి రెడ్డి పేరును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించగా.. వివాదం నెలకోంది. జాతీయ పార్టీ అధినేతల అదేశాలు లేకుండా అభ్యర్ధి పేరును ఎలా ప్రకటిస్తారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గాంధిభవన్ సాక్షిగా పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభ్యర్థి ఎంపికలో రెండు వర్గాల మధ్య పోరు

అభ్యర్థి ఎంపికలో రెండు వర్గాల మధ్య పోరు

దీంతో అభ్యర్థి ఎంపికపై అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి వర్గాల మధ్య వర్గపోరు కొనసాగింది. పద్మావతి రెడ్డి అభ్యర్థత్వానికి వ్వతిరేకంగా ఎంపీ రేవంత్ రెడ్డి పావులు కదిపాడు. తనకు సన్నిహితులైన చామా కిరణ్ రెడ్డికి అభ్యర్థిత్వంపై ఆయన మొగ్గుచూపారు. దీంతో రెండు వర్గాల మధ్య వర్గపోరు మరింత తీవ్రమైంది. ఓవైపు అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానంపై సందిగ్ధం నెలకోంది.

ఉత్తమ్‌కు మద్దతుగా నిలిచిన ఎంపీ కోమటిరెడ్డి,

ఉత్తమ్‌కు మద్దతుగా నిలిచిన ఎంపీ కోమటిరెడ్డి,

మరోవైపు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మద్దతుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మద్దతుగా నిలిచారు. అభ్యర్థి ఎంపికపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎంపీ కోమటి రెడ్డి వెంటట్ రెడ్డీ తీవ్రంగా ఖండించారు. తమ జిల్లాలో రేవంత్ రెడ్డి జోక్యం ఎందుకని ప్రశ్నించారు. అభ్యర్థి ఎంపికపై జానారెడ్డితోపాటు తాను సంతృప్తిగానే ఉన్నామని చెప్పారు. ఇక పార్టీలో ఇటివల చేరిన నాయకుల సలహాలు అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన అభ్యర్థి ఎవరో తనకే తెలియదని షాక్ ఇచ్చారు.

ఉత్తమ్ వర్గానిదే పైచేయి...

ఉత్తమ్ వర్గానిదే పైచేయి...


అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడ పద్మావతి రెడ్డి పేరునే ఖారారు చేసింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పద్మావతి పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో ఉత్తమ్ వర్గానిదే పైచేయి అయింది. దీంతో ఎంపీ రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కాగా రేవంత్ అభ్యర్థి ఎంపికపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడ వ్యతిరేకించారు. పీసీసీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా వ్వవహరించడం వల్ల పార్టీలో తన స్థాయిని దిగజార్చుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్‌రెడ్డి స్పందన ఎలా ఉంటుంది...?

రేవంత్‌రెడ్డి స్పందన ఎలా ఉంటుంది...?


కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధినేత్రీ సోనియా గాంధీని కలిశారు. దీంతో ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం కూడ కొనసాగింది. అయితే అంతలోనే అలాంటీ పరిస్థితులు ఏవి లేవని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి కూడ ఎలాంటీ వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా అభ్యర్థి ఎంపిక విషయంలో కూడ రేవంత్ రెడ్డి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని పరిస్ధితి నెలకోంది. దీంతో పార్టీ నేతలు, హైకమాండ్ నిర్ణయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
Former MLA, PCC chief UttamKumar Reddy Wife padmavathi reddy has been confirmed as Huzurnagar in by-election by the Congress chief Sonia gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X