నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుజూర్ నగర్ లో గులాబీ గెలిస్తే ఓ లెక్క..!గెలవకపోతే మరో లెక్క..!కేసీఆర్ అదే చేస్తారు పక్కా..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కత్తికి రెండు వైపులా పదును ఉంటే మహా ప్రమాదంగా కనిపిస్తుంటుంది. ఎంతటి శత్రువునైనా ఇట్టే భయపెట్టొచ్చు. అదే మాటకు పదునుంటే, అది కూడా రెండువైపులా పదునుంటే ఇక ప్రశ్నించే వాడికి చుక్కలు కనబడటం ఖాయం. హుజూర్ నగర ఉప ఎన్నిక ఫలితంపై అధికార గులాబీ పార్టీ అచ్చం ఇలాంటి వ్యూహానికి శ్రీకారం చుట్టబోతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపుకోసం అన్ని ప్రత్నాలు చేసినప్పటికి ఫలితం ప్రతికూలంగా వస్తే ప్రజలకు ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే అంశంపై సీఎం చంద్రశేఖర్ రావు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. హుజూర్ నగర్ లో గెలిస్తే పరవాలేదు, గెలవక పోతే దాని ప్రభావం అంతాగా లేకుండా, ఎందుకు ఓడిందో అదే కారణం ప్రజలకు చెప్పాలని గులాబీ పార్టీ బాస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్న హుజూర్ నగర్ ఉప ఫలితం..! గులాబీ పార్టీకి ఎంతో ప్రత్యేకం..!!

అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్న హుజూర్ నగర్ ఉప ఫలితం..! గులాబీ పార్టీకి ఎంతో ప్రత్యేకం..!!

రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు సామాన్య జ‌నం కూడా హుజూర్ నగర్ ఫలితం పట్ల తీవ్ర ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందోన‌ని ఊపిరి బిగ‌బ‌ట్టుకుని ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో ఫ‌లితం త‌మ‌కే అనుకూలంగా వ‌స్తుంద‌ని ఆయా పార్టీలు మాత్రం ధీమాగా ఉన్నాయి. అయితే.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార టీఆర్ఎస్‌ పార్టీకే అనుకూలతను వ్యక్తం చేసాయి. ఈసారి గులాబీ విజ‌యం ఖాయ‌మ‌ని గొతెత్తి చాటాయి. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోక‌ త‌ప్ప‌ద‌నే చర్చ కూడా జరుగుతోంది.

టీఆర్ఎస్ గెలిస్తే ఓకే..! గెలవకపోతే మాత్రం అదే కారణం చెప్పబోతున్న గులాబీ బాస్..!!

టీఆర్ఎస్ గెలిస్తే ఓకే..! గెలవకపోతే మాత్రం అదే కారణం చెప్పబోతున్న గులాబీ బాస్..!!

హుజూర్‌న‌గ‌ర్ లో జరిగిన ఎన్నికల్లో ఇప్ప‌టివ‌ర‌కు అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో గులాబీ పార్టీ తీవ్రంగా శ్రమించింది. ఎన్నికకు రెండు వారాల ముందు ఆర్టీసి ఉద్యోగుల సమ్మెకు పిలుపు నివ్వడం, దాదాపు 50వేల మంది ఉద్యోగులు సాల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం చంద్రశేఖర్ రావు ప్రటించడం, ఇద్దరు ఉద్యోగులు ఆత్వహత్యకు పాల్పడడం వంటి పరిణామాలు చకాచకా జరిగిపోయాయి. దీంతో ఆర్టీసి ఉద్యోగుల సమ్మె ఉదృతం కావడమే కాక, కార్మికుల మరణం ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించింది. అంతే కాకుండా కోర్టు కూడా కార్మికులకు అనుకూలంగా స్పందించడంతో ప్రభుత్వం మరింత ఇరుకున పడ్డట్టయ్యింది. దీని ప్రభావం పూర్తిగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద పనిచేసినట్టు తెలుస్తోంది.

ఓడితే ఏంటన్న అంశంపై చర్చ..! ఓటమి ప్రభావాన్ని అదిగమించేందుకు గులాబీ శ్రేణుల కసరత్తు..!!

ఓడితే ఏంటన్న అంశంపై చర్చ..! ఓటమి ప్రభావాన్ని అదిగమించేందుకు గులాబీ శ్రేణుల కసరత్తు..!!

అంతే కాకుండా ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌న‌గ‌ర్ ఉప ఫలితం ఆసక్తికరంగా మారనుంది. తెలంగాణలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నిక గెలుపు అధికార గులాబీ పార్టీకి మాత్రం ఎంతో ప్రత్యేకం కానుంది. హుజూర్ నగర్ లో గెలిస్తే ఒక లెక్క గెలవకపోతే మరోలెక్క అన్నట్టు వ్యవహరించబోతుంది అధికార గులాబీ పార్టీ. గులాబీ పార్టీ గెలిస్తే ప్రజలకు చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పైన ఇంకా విశ్వాసం ఉన్నట్టు, గెలవక పోతే ఆర్టీసి ఉద్యోగుల ప్రభావం ప్రజల్లో పనిచేసినట్టుగా భావించాల్సిఉంటుందనే సంకేతాలను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్లాన్ ఏ, ప్లాన్ బీ..! ఫలితంపై వివరణ ఇవ్వాలనుకుంటున్న టీఆర్ఎస్..!!

ప్లాన్ ఏ, ప్లాన్ బీ..! ఫలితంపై వివరణ ఇవ్వాలనుకుంటున్న టీఆర్ఎస్..!!

ఇక ఇదే స‌మ‌యంలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవ‌డానికి కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేసింది. చివరి రెండె రోజుల రేవంత్ రెడ్డి ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఫుల్ జోష్ నింపిందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఐనప్పటికి ఫ‌లితం అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ‌స్తే, ఇక ప్ర‌జా మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌న్న విష‌యాన్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్తుంద‌ని, ఇదే స‌మ‌యంలో సీఎం చంద్రశేఖర్ రావు మ‌రింత దూకుడుగా, కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, ఆర్టీసీ విష‌యంలో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒక‌వేళ ఫ‌లితం ప్ర‌తికూలంగా వ‌స్తే మాత్రం, ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ప‌త‌నానికి పార్లమెంట్ ఎన్నికలు పునాదులు వేస్తే, ఆర్టీసి సమ్మె సహకారంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక పిల్లార్లు నిర్మించిందనే చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది.

English summary
If win the Pink party in Huzur Nagar, the government is planning to give signals that the Chandrasekhar Rao government is still confident.. if loose in the by election that the impact of RTC employees will be felt by the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X