నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆగవ్వకు అస్వస్థత.. సీఎం కేసీఆర్‌తో కలిసి సహపంక్తి భోజనం

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ ఇటీవల దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. అందరీతో కలిసి సహపంక్తి భోజనం కూడా చేశారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే కేసీఆర్ పక్కన ఆకుల ఆగవ్వ అనే వృద్దురాలు కూర్చొంది. సీఎంతో కలిసి ఆమె భోజనం చేసింది. ఆమె అస్వస్థతకు గురయ్యింది. మీటింగ్ జరిగిన రోజు రాత్రే ఆమె అనారోగ్యం బారిన పడింది. ఈ నెల 22వ తేదీన రాత్రి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఆగవ్వకు అస్వస్థత

ఆగవ్వకు అస్వస్థత


ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత వైద్యులు వాసాలమర్రికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహసంక్తి భోజనం చేశారు. దాదాపు 3 వేల మంది గ్రామస్తులతోపాటు ఆగవ్వ కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పక్కనే కూర్చుని ఆగవ్వ భోజనం చేశారు. వాసాలమర్రి గ్రామంలో ఆగవ్వ తన దోస్త్ అని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాతే అనారోగ్యం బారిన పడటం.. కోలుకోవడం చకచకా జరిగిపోయాయి.

సకల సౌకర్యాలు

సకల సౌకర్యాలు

దత్తత గ్రామం యాదాద్రి జిల్లా వాసాలమర్రికి 20 సార్లు వస్తానని కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఈ సారి ఇలాంటి సభలు జరగవు. ఏడాది తర్వాత వాసాలమర్రి... బీ వాసాలమర్రి కావాలి. బి అంటే బంగారు వాసాలమర్రి అని అర్థం. వీటన్నింటికంటే ముందు ప్రేమ భావం ఎంతో ముఖ్యం అని కేసీఆర్ అన్నారు. ఊరిలో వివాదాలు ఉండొద్దు. సమస్యలు పరిష్కరించి కేసులు పరిష్కరించాలని పోలీసు అధికారులకు కూడా చెబుతా. పొరుగింటి వాళ్ల అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అలాంటప్పుడు బంగారు వాసాలమర్రి సాకారం కాదా? అన్నారు.

అన్నీ వస్తాయి..

అన్నీ వస్తాయి..

సీఎం అంతటివాడే మీ వాడైనప్పుడు అన్నీ మీ ఊరికి వస్తాయి. ప్రతి ఒక్కరికీ గొర్రెనో, బర్రెనో, ట్రాక్టరో ఇవ్వగలను. కానీ ఇప్పుడు కావాల్సింది మీ గ్రామస్తుల్లో ఐక్యత. పట్టుబట్టి అద్భుతం చేశారని చుట్టు పక్కల గ్రామాలన్నీ మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి" అని కర్తవ్య బోధ చేశారు. గ్రామాభివృద్ధికి ఓ కమిటీ అవసరమని, పార్టీలకు అతీతంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.

English summary
vasalamarri agavva health is unwell, she sat beside kcr for launch this month 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X