నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్ర-గులాబీలు ఏకం అయ్యేనా...? హుజూర్ నగర్ ఉపపోరులో సరికొత్త సమీకరణాలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక కోసం నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారబోతోంది. దాదాపు 120 నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. ఇంత వరకూ సాదారణంగా జరిగే తంతే..! గెలుపుకోసం ధీమాగా ఉండాల్సిన అధికార పార్టీ విన్యాసాలు అందరిచేత ఔరా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు వారి మద్దత్తును కోరండం రాజకీయ వర్గాలకే అంతుచిక్కని ప్రశ్నగా మిరింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లెఫ్ట్ పార్టీల ప్రభావం ఉన్నా ప్రస్తుతం గెలుపోటములను నిర్ధారించే సత్తా ఆవబ పార్టీలకు లేదనే చర్చ కూడా జరుగుతోంది. అలాంటప్పుడు సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు ఎర్ర పార్టీలకు అంత ప్రాముఖ్యతనిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ జోరుపై బీజేపీ కన్ను.. కోల్‌బెల్ట్ ఏరియాలో కిషన్ రెడ్డి పర్యటన అందుకేనా? టీఆర్ఎస్ జోరుపై బీజేపీ కన్ను.. కోల్‌బెల్ట్ ఏరియాలో కిషన్ రెడ్డి పర్యటన అందుకేనా?

గులాబీ పార్టీకి హుజూర్ నగర్ ఉప ఎన్నిక కష్టాలు.. ఎర్ర పార్టీతో స్నేహం కోసం పాట్లు..

గులాబీ పార్టీకి హుజూర్ నగర్ ఉప ఎన్నిక కష్టాలు.. ఎర్ర పార్టీతో స్నేహం కోసం పాట్లు..

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పర్వం నామినేషన్ల పక్రియను దాటింది. కథ ఇంతవ‌ర‌కూ బాగానే ఉంది. మ‌రి ఫ‌లితం ఎలా ఉండ‌బోతుంది. బంగారు తెలంగాణకు నవ సారధిగా సీఎం చంద్రశేఖర్ రావు అని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి కూడా ఉప ఎన్నిక గుబులు పుట్టిస్తోంది. ఇక్క‌డ గెలిస్తే తమకు ఎదురు లేదని, తమలాంటి పరిపాలన గతంలో ఎవ్వరూ ఇవ్వనందుకే ప్రజలు గులాబీ ప్రభుత్వానికి పెద్దయెత్తున నీరాజనాలు పలుకుతున్నారన్న అంశాన్ని చాటి చెప్పాలనుకుంటోంది అదిక్ార పార్టీ. ఒక‌వేళ గులాబీ పార్టీకి ప్రతికూలంగా హుజూర్ నగర్ ఉప ఫలితం వచ్చినా ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకునే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఆత్మ స్థైర్యానికి ఏమైంది..! ఒంటరిగా గెలవలేని పరిస్ధితా..?

టీఆర్ఎస్ ఆత్మ స్థైర్యానికి ఏమైంది..! ఒంటరిగా గెలవలేని పరిస్ధితా..?

ఇలాంటి పరిస్థితుల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో తమ ఇజం మావోయిజమని, ఎర్ర‌జెండాల‌కు అవ‌కాశ‌మే లేదంటూ గతంలో మొండిగా వ్యవహరించిన చంద్రశేఖర్ రావు, హుజూర్‌న‌గ‌ర్‌లో మాత్రం త‌మ‌కు సాయం చేయ‌మంటూ వామ‌ప‌క్షాల వ‌ద్ద‌కుచేరారు. దీంతో గ‌తానికి భిన్నంగా ఇప్పుడు ఉప ఎన్నిక ఉత్కంఠ‌త‌ను రేకెత్తిస్తుంది. సైదిరెడ్డిపై అంత‌గా ప్ర‌జ‌ల్లో ఇమేజ్ లేదు. గ‌త త‌ప్పిదాలు శాపంలా వెంటాడుతూనే ఉన్నాయి. జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డికి బినామీ అనే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బాగా నాటుకుంది. ఈ పరిణామాలను గమనించిన చంద్రశేకర్ రావు ఒడ్డున పడేందుకు ఇష్టం లేకున్నా వామపక్షాలను వెంటతీసుకెళ్లాని బావిస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. హుజూర్ నగర్ లో మకాం వేసిన ముఖ్య నేతలు..

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. హుజూర్ నగర్ లో మకాం వేసిన ముఖ్య నేతలు..

టీపిసిసి అధ్యక్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న‌పుడు కేవ‌లం నామమాత్రపు పాల‌న కొన‌సాగింది. ఇప్పుడు ఇక్క‌డ గెలిచినా త‌మ‌కు అదే ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌నే ఆందోళ‌న కూడా ఓట‌ర్ల‌లో నెల‌కొంది. దీంతో మరింత పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. బీజేపీ కూడా త‌మ బ‌లాన్ని మ‌రింత ఎక్కువ‌గా ఊహించుకుంటుంది. ఇది స‌హ‌జంగానే చంద్రశేఖర్ రావు వంటి నాయ‌కుడిని ఆలోచ‌న‌లో ప‌డేసింది. గులాబీ శ్రేణులు కూడా ఆచితూచి స్పందిస్తున్నాయి. అందుకే.. సీపీఐతో పొత్తు కోసం ఏకంగా కేకే వంటి సీనియ‌ర్‌ను పంపారు. న‌ల్ల‌గొండ , సూర్యాపేట జిల్లాల్లో వామ‌ప‌క్షాల‌కు మంచి క్యాడ‌ర్ ఉంది. పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయలేకపోయినా ప్రత్యర్థి పార్టీలను ఓటమి వాకిట్లోకి మాత్రం చేర్చగలవు. ఇదే అంశాన్ని పసిగట్టిన చంద్రశేఖర్ రావు చాకచక్యంగా సీసీఐని త‌మ వైపున‌కు తిప్పుకున్నారు. టీడీపీ అభ్య‌ర్థి చీల్చే ఓట్లు కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్‌కు న‌ష్టం చేకూర్చుతాయా అనేది కూడా సందిగ్దంగా మారింది.

కోదండరాం మద్దత్తు ఎవరికి..? కాంగ్రెస్ కు మద్దత్తిచ్చే అంశంలో మరికొంత సమయం కోరిన టీజేఎస్..

కోదండరాం మద్దత్తు ఎవరికి..? కాంగ్రెస్ కు మద్దత్తిచ్చే అంశంలో మరికొంత సమయం కోరిన టీజేఎస్..

తెలంగాణలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్బంగా రాజకీయ పార్టీల జోరు శరవేగంగా కొనసాగుతోంది. తమ బలాన్ని నిరూపించుకోవడానికి నువ్వా నేనా, అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఓ పక్క టీఆర్ఎస్, ఎర్ర జెండాలను అక్కున చేర్చుకోవడానికి, వారి మద్దతు పొందడానికి పావులు కదుపుతుంటే, మరో పక్క కాంగ్రెస్ టీజేఎస్ మద్దతుకోసం ప్రణాళికలు రచిస్తోంది. ఈ సందర్భంగా నాంపల్లి టి.జె.యస్ రాష్ట్ర కార్యాలయంలో కోదండరామ్ తో కాంగ్రెస్ శ్రేణులు కీలక సమావేశం నిర్వహించాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమకు మద్దతు కోరినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పొల్లొన్నారు. ఐతే మద్దత్తు ఇచ్చే అంశంలో జన సమితి అద్యక్షుడు కోదండరాం మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పార్టీ ముఖ్యులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని కాంగ్రెస్ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.

English summary
The TRS party seems to have been ambitious in the Hujur Nagar by-election. CM Chandrasekhar Rao, who had previously been adamant that they were not in the red flags of Telangana, was unable to help him in the General Elections. But In contrast to the  Huzur nagar, the by-election now raises the thrill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X