నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా హత్యకు రూ. కోటి డీల్: భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలనం, పోలీసుల వల్లే..

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు ప్రయత్నించారని
అన్నారు.

సుబ్బారెడ్డి హత్యకు కుట్ర! పరారీలో భూమా అఖిలప్రియ: జగన్ పార్టీ ఎమ్మెల్సీ సంచలనంసుబ్బారెడ్డి హత్యకు కుట్ర! పరారీలో భూమా అఖిలప్రియ: జగన్ పార్టీ ఎమ్మెల్సీ సంచలనం

నన్ను చంపడానికి రూ. కోటి డీల్

నన్ను చంపడానికి రూ. కోటి డీల్


అంతేగాక, తనను చంపడానికి భూమా అఖిలప్రియ దంపతులు రూ. కోటి ఒప్పందం కూడా చేసుకున్నారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రామిరెడ్డి, రవిచంద్రారెడ్డి చెరో రూ. 50 లక్షలకు ఈ మర్డర్ డీల్ ఒప్పుకున్నారని, వీరిని పోలీసులు అరెస్ట్ చేస్తే విషయం బయటకు వస్తుందని అన్నారు. భూమా అఖిలప్రియ రామిరెడ్డి, రవిచంద్రారెడ్డిలకు డబ్బులు ఇచ్చారని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు ముద్దాయిలు ఉన్నారని, వీరిలో అఖిలప్రియ ఏ4, ఆమె భార్త భార్గవ్ ఏ5గా ఉన్నారని చెప్పారు. కడప పోలీసులు లేకపోతే తన హత్య జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు సుబ్బారెడ్డి.

ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిన అఖిలప్రియ..

ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిన అఖిలప్రియ..

మహిళ ముసుగులో అఖిలప్రియ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారన్నారు. కుట్రను భగ్నం చేసి తనను కాపాడిన కడప పోలీసులకు ఏవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భూమా అఖిలప్రియ అనుచరుడు మాదా శ్రీను డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారని తెలిపారు. తన ముగ్గురు కూతుళ్లతో సమానంగా తాను అఖిలప్రియను ప్రేమగా చూసకున్నానని, రాజకీయ కుట్రతోనే అఖిలప్రియ తన హత్యకు ప్రణాళిక వేసిందన్నారు. తమ పార్టీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Recommended Video

బీజేపీ కార్యకర్త చెంప ఛెళ్లు మనిపించిన లేడీ కలెక్టర్ ! || Oneindia Telugu
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్..

హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్..

కాగా, ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ఓ ముఠా కుట్ర పన్నింది. మార్చిలో పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కడప పోలీసులు.. సుపారీ తీసుకున్న నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.2లక్షలు, ఓ పిస్తోల్ ను స్వాధీనం చేసుకున్నారు. మాదా శ్రీనివాసులును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు జరిపిన ఆర్థిక లావాదేవీల్లో శ్రీనివాసులు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఏవీ సుబ్బారెడ్డి దివంగత నేత భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. ఏవీ సుబ్బారెడ్డి 2009లో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం నుంచి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2014లో భూమా కుటుంబం వైసీపీలో చేరడంతో వారితో పాటే వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం భూమా కుటుంబం తిరిగి టీడీపీలో చేరడంతో నాగిరెడ్డితో పాటే ఏవీ సుబ్బారెడ్డి కూడా టీడీపీలో చేరారు. నాగిరెడ్డి మరణంతో ఆయన ఒంటరివారయ్యారు. అయితే, ప్రస్తుతం ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉండటంతో అఖిలప్రియ ఆయనను దూరం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
av subba reddy sensational comments on bhuma akhilapriya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X