భూమా అఖిల ప్రియకు బిగుస్తున్న ఉచ్చు .. కిడ్నాప్ కేసులో రెండో రోజు ప్రశ్నలతో మాజీ మంత్రి ఉక్కిరిబిక్కిరి
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు కస్టడీలో భాగంగా నిన్న భూమా అఖిల ప్రియ విచారించిన పోలీసులు, ఈరోజు మరోమారు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల ప్రశ్నలతో భూమా అఖిలప్రియ ఉక్కిరి బిక్కిరి
పోలీసుల ప్రశ్నలతో భూమా అఖిలప్రియ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు సమాచారం.
కిడ్నాప్ వ్యవహారంలో భూమా అఖిలప్రియ వినియోగించిన మొబైల్ ఫోను ను , కిడ్నాప్ కి సంబంధించి 143 ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేసిన పోలీసులు పక్క ఆధారాలతోనే భూమా అఖిలప్రియ అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో ఈరోజు భూమా అఖిలప్రియ విచారణ జరుపుతున్న పోలీసులకు అఖిలప్రియ తనకు ఈ కేసుతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్తున్నారు.

కాల్ డేటా ముందు పెట్టి మరీ ప్రశ్నిస్తున్న పోలీసులు
అయితే పోలీసులు అఖిల ప్రియ వినియోగించిన మొబైల్ నెంబర్ నుండి కాల్ లిస్టు లు ఆమె ముందు ఉంచి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
సెల్ ఫోన్ సిగ్నల్స్ , టవర్ లొకేషన్స్ కు సంబంధించిన ఆధారాలను చూపించి భూమా అఖిలప్రియ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అఖిల ప్రియ భర్త ఆచూకీ కోసం కూడా పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కిడ్నాప్ వ్యవహారంలో భాగస్వామ్యం తీసుకున్న మరికొందరిపై కూడా అఖిల ప్రియను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మొత్తం కిడ్నాప్ వ్యవహారంలో 19 మంది పాత్ర
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను ల కోసం గాలిస్తున్నారు. వీరిరువురూ పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఈ కిడ్నాప్ వ్యవహారంలో 19 మంది పాత్ర ఉన్నట్లు గా గుర్తించిన పోలీసులు అందరినీ విచారిస్తున్నట్లు గా తెలుస్తోంది.