వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నాని సంచలనం: చంద్రబాబు ఇంట్లోనే డాక్టర్ రమేశ్ దాక్కున్నారు.. ఏ తప్పు చేయకుంటే..

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా విమర్శలు చేశారు. స్వర్ణ ప్యాలెజ్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ రమేశ్‌ను ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు. రమేశ్ వెనక ఎవరు ఉన్నారో అందిరికీ తెలుసన్నారు. తప్పు చేయకుంటే ఎందుకు పారిపోతున్నారని సూటిగా అడిగారు.

డాక్టర్ రమేశ్ ఎక్కడ అంటూ కొడాలి నాని ఫైరయ్యారు. కోవిడ్ ఆస్పత్రి వెనక బడాబాబులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు నిమ్మగడ్డ రమేశ్.. ఇప్పుడు డాక్టర్ రమేశ్‌‌ను వెనకేసుకొచ్చింది ఎవరూ అని ప్రశ్నించారు. పరోక్షంగా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఆరోపణలు చేశారు. డాక్టర్ రమేశ్.. చంద్రబాబు ఇంట్లోనే తలదాచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదంటే చినబాబు అయినా ఆశ్రయం కల్పించాల్సి ఉండేదని ఆరోపించారు.

Dr ramesh in chandrababu home, minister kodali nani alleged

Recommended Video

Sanchaita Gajapathi Raju VS Chandrababu క్షమాపణా లేదంటే చట్ట పరమైన చర్యలా ? || Oneindia Telugu

స్వర్ణ ప్యాలెస్ ఘటనకు సంబంధించి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి ఇదివనరూ సమర్పించింది. కోవిడ్ సెంటర్, హోటల్ సీజ్ చేయాలని సిఫారసు చేశారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యంతో రమేశ్ ఆస్పత్రి చేసుకున్న అగ్రిమెంట్‌ నిబంధనలు ఉల్లంఘించి చేసుకున్నారని పేర్కొన్నది. అగ్రిప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించకుండానే ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. కోవిడ్ చికిత్సకు సంబంధించి ప్రోటోకాల్ పూర్తిగా ఉల్లంఘించారని.. ప్రభుత్వ మార్గదర్శకాలను పెడచెవిన పెట్టినట్టు స్పష్టంచేసింది.

English summary
swarna palace covid care administrator Dr ramesh in chandrababu home. ap minister kodali nani alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X