నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్ముంటే ఆళ్లగడ్డలో రాజకీయాలు చెయ్యండి ..ఏవీ సుబ్బారెడ్డి వెనుక ఉంది వారే : భూమా అఖిల కౌంటర్

|
Google Oneindia TeluguNews

టిడిపి నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .టిడిపి మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, సుబ్బారెడ్డికి దమ్ముంటే ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు చెయ్యాలని అన్నారు .ఆళ్లగడ్డ వైయస్ఆర్సిపి నాయకుల మద్దతుతో సుబ్బారెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

ఇంత నీఛ రాజకీయాలా .. వైసీపీ సర్కార్ ను లెక్కలడిగి కడిగేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియఇంత నీఛ రాజకీయాలా .. వైసీపీ సర్కార్ ను లెక్కలడిగి కడిగేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

 సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతల హస్తం

సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతల హస్తం

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తనను చంపేందుకు కుట్ర చేశారని ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణల నేపధ్యంలో స్పందించిన అఖిలప్రియ తనను అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ వెనకున్న ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదని చెప్పారు.కేవలం వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు . ఆయన వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతల హస్తం ఉండొచ్చన్న ఆమె వైసీపీ అధిష్ఠానం ప్రమేయం ఉండకపోవచ్చని చెప్పారు.

 పోలీసులకు అరెస్ట్ చెయ్యమని డైరెక్షన్ ఇవ్వటం కరెక్ట్ కాదు

పోలీసులకు అరెస్ట్ చెయ్యమని డైరెక్షన్ ఇవ్వటం కరెక్ట్ కాదు

ఇక తమకు ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని పేర్కొన్న ఆమె సుబ్బా రెడ్డి హత్యా యత్నానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో తన హస్తం ఉన్నట్టు ఇప్పటి వరకు బయటకు రాలేదని , సుబ్బారెడ్డి చెప్తున్నట్టు ఏ4 ముద్దాయిగా తనకు నోటీసులు కూడా అందలేదని తెలిపారు. అయితే తనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం సుబ్బారెడ్డికి సమంజసం కాదని చెప్పారు భూమా అఖిల ప్రియ .

 కావాలనే ఇదంతా .. ఆళ్ళగడ్డలో రాజకీయాలు చెయ్యండి .. స్వాగతిస్తా

కావాలనే ఇదంతా .. ఆళ్ళగడ్డలో రాజకీయాలు చెయ్యండి .. స్వాగతిస్తా

తన భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని గత అక్టోబర్ లో ఓ క్రషర్ ఇండస్ట్రీ యజమాని ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారని అఖిలప్రియ తెలిపారు. దీనికి సంబంధించి బెయిల్ కోసం తాము దరఖాస్తు చేశామని ఈ సమయంలో సుబ్బారెడ్డి ఈ తరహా ఆరోపణలు చేస్తుండటం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. కావాలని చేస్తున్నారని , ఇష్యూని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారని అన్నారు . సుబ్బారెడ్డికి పదవులు ఇచ్చినా తాను అడ్డు చెప్పలేదని అన్నారు. ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటే తాను స్వాగతిస్తానని, గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు పనులు ఎలా చేయిస్తారో తనకు కూడా చూడాలని ఉందని చెప్పారు.

 పక్క దారి పట్టించేందుకే ఈ ఆరోపణలు అన్న భూమా అఖిల

పక్క దారి పట్టించేందుకే ఈ ఆరోపణలు అన్న భూమా అఖిల

అంతే తప్ప ఎవరో చెప్తే విని ఈ తరహా ఆరోపణలు చెయ్యటం కరెక్ట్ కాదన్నారు భూమా అఖిల ప్రియ .ఇక తన తండ్రికి సంబంధించిన బినామీ ఆస్తులు సుబ్బారెడ్డి పేరు మీద ఉంటే అవి ఆయనకే చెందుతాయని ఆమె పేర్కొన్నారు. టీడీపీ అధికారం పోగొట్టుకున్నాక ఏ రోజైనా ప్రజల కోసం అధికార పక్షంపై మాట్లాడారా అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా మాట్లాడలేదన్నారు. ఇక పోలీసులను పక్కదారి పట్టించటానికి ఇప్పుడు ఇలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు .

English summary
TDP leader former minister bhuma akhila priya has given a reverse counter to AV Subbareddy allegations on her. She suspected that Subbareddy was accusing her with the support of YSRCP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X