నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ నేత భూమా అఖిలప్రియకు ఉచ్చు బిగుస్తున్నా .. బోయినపల్లి కిడ్నాప్ కేసుపై చంద్రబాబు సైలెంట్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియను దోషిగా తేల్చే ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు . ఒక ప్రజా ప్రతినిధిగా అనుభవం ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి, తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న భూమా అఖిలప్రియ బోయినపల్లి సోదరుడు కిడ్నాప్ కేసులో బయటపడలేనంతగా
ఇరుక్కుంటున్నారు. ఈ కేసులో అఖిల ప్రియ టీడీపీ నేత అయినా చంద్రబాబు నోరు మెదపటం లేదు . సైలెంట్ గా జరుగుతుంది చూస్తుండిపోయారు.

ఏపీలో బ్రిటీష్ రూల్... ఇన్సైడర్ ట్రేడింగ్ నిరూపించారా విశాఖపై మీ కన్ను అందుకే భూమా అఖిలప్రియ ఫైర్ఏపీలో బ్రిటీష్ రూల్... ఇన్సైడర్ ట్రేడింగ్ నిరూపించారా విశాఖపై మీ కన్ను అందుకే భూమా అఖిలప్రియ ఫైర్

టీడీపీ నేతలకు చిరాకుగా బోయినపల్లి కిడ్నాప్ కేసు

టీడీపీ నేతలకు చిరాకుగా బోయినపల్లి కిడ్నాప్ కేసు

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేతలపై కేసులు పెరిగిపోతున్న క్రమంలో, తాజాగా భూమా అఖిలప్రియ పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయారైంది. అసలే ఏపీలో టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ సర్కార్ కేసుల మీద కేసులు పెడుతున్న తరుణంలో అఖిలప్రియ చేయించినట్టు పోలీసులు చెప్తున్నకిడ్నాప్ కథ టీడీపీ నేతలకు చిరాకుగా మారింది . తమను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారని అఖిల ప్రియ కుటుంబం వాదిస్తున్నా అలాంటిదేమీ లేదని పక్కా ఆధారాలు ఉన్నాయని తేల్చి చెప్తుంది పోలీస్ శాఖ .

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

 భూమా అఖిలప్రియ కర్త ,కర్మ, క్రియగా పోలీసుల విచారణ

భూమా అఖిలప్రియ కర్త ,కర్మ, క్రియగా పోలీసుల విచారణ


రెండు వేల కోట్ల విలువైన భూముల వివాదంలో భూమా అఖిలప్రియ కర్త ,కర్మ, క్రియగా వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులు గత రెండు రోజులుగా ఆమెను విచారిస్తున్న క్రమంలో గుంటూరు శ్రీను తో ఆమె ఫోన్ కాల్ వ్యవహారాన్ని ప్రశ్నించారు. తాను పొలిటీషియన్ అని ఎవరితో నైనా ఫోన్లో మాట్లాడతాను అని , అదే క్రమంలోగుంటూరు శ్రీను తో మాట్లాడాలని వెల్లడించారు. భూమా అఖిలప్రియ చెప్పిన కొన్ని అంశాలు, భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకుడు చెప్పిన విషయాల ద్వారా పోలీసులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్ట్ చేసిన పోలీసులు నలుగురు వద్దనుండి వేరువేరుగా వివరాలను సేకరించి భూమా అఖిలప్రియ పాత్రను నిర్ధారించే పనిలో పడ్డారు.

అఖిల కుటుంబం పాత్ర .. ఐటీ అధికారులుగా వ్యవహరించిన వారి అరెస్ట్

అఖిల కుటుంబం పాత్ర .. ఐటీ అధికారులుగా వ్యవహరించిన వారి అరెస్ట్


అఖిల ప్రియ కుటుంబం ప్రమేయంపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బోయినపల్లి కిడ్నాప్ కేసులో తాజాగా 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం . నలుగుర్ని గుంటూరు ,విజయవాడలలో మరో నలుగురిని గోవాలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎనిమిది మంది నిందితులు ఐటి అధికారులుగా వేషాలు వేసిన వారేనని పోలీసులు గుర్తించారు. భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకుడు నిందితుల వివరాలు వెల్లడించడంతో వారి కదలికలపై నిఘా ఉంచిన బోయినపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ కేసులో అఖిలప్రియ సోదరుడి పాత్ర, అలాగే భార్గవ్ రామ్ సోదరుడి పాత్ర ఇలా భూమా కుటుంబానికి సంబంధించిన వారు పలువురికి ప్రమేయం ఉన్న కారణంగా అఖిల ప్రియ కేసులో గట్టిగానే ఇరుక్కున్నట్లుగా తెలుస్తుంది.

 టీడీపీ అంటేనే భగ్గుమనే కేసీఆర్ , వైఎస్ జగన్ .. కీలక ఆధారాలతో అఖిల బుక్

టీడీపీ అంటేనే భగ్గుమనే కేసీఆర్ , వైఎస్ జగన్ .. కీలక ఆధారాలతో అఖిల బుక్

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేతల అక్రమాలను బయటకి తెస్తూ కేసులు పెడుతూ వైసిపి సర్కార్, ఇంకొకపక్క తెలంగాణ రాష్ట్రంలో సైతం చంద్రబాబును వ్యతిరేకించే టిఆర్ఎస్ సర్కార్ , ప్రస్తుతం టిడిపి నేతలకు తలనొప్పి కాగా ఈ కేసు నుండి అఖిల బయటపడదు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది .కిడ్నాప్ కు గురైన ప్రవీణ్ రావు సోదరులు సీఎం కేసీఆర్ కు దగ్గర బంధువులు కావటంతో కూడా పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసు నుండి భూమా అఖిలప్రియ బయటపడటం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. అఖిల ప్రియ దోషిగా తేల్చడానికి కావాల్సిన కీలకమైన క్లూస్ అన్నింటినీ పోలీసులు సేకరించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ కేసు వ్యవహారంలో నోరెత్తకపోవడంతో అఖిల ప్రియ కేసు నుంచి బయట పడటం ఈజీ కాదనే అభిప్రాయం ఉంది.

English summary
Police are collecting evidence to convict Bhuma Akhil Priya in the Boyanapalli kidnapping case which has created a sensation in Telugu states. Bhuma Akhilapriya who had experience as a MLA and served as a minister in the state of Andhra Pradesh and is a key person in the Telugu Desam Party, could not get out of the kidnapping case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X