సీన్ రివర్స్ .. ఏపీలో ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు .. కారణం ఇదే !!
యాసిడ్ దాడి ఘటనలు అమ్మాయిలపైన మాత్రమే కాదు , అబ్బాయిలపైనా జరుగుతున్నాయి. ప్రేమించిన అబ్బాయి మోసం చేస్తే దాడి చేస్తున్న వాళ్లు, ఇళ్ల ముందుకు వెళ్ళి ధర్నాలు చేస్తున్న వాళ్ళు, కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న వాళ్ళు మాత్రమే కాదు యాసిడ్ తో దాడి చేస్తున్న అమ్మాయిలు కూడా ఇప్పుడు పెరిగి పోయారు.
హన్మకొండలో మహిళ దారుణ హత్య.. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే

ప్రేమించి మోసం చేశాడని ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన యువతి
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో ఒక అమ్మాయి తనను కాదని వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడన్న కోపంతో ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. స్థానికంగా ఈ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.
తనను కాదని వేరే అమ్మాయిని వివాహం చేసుకున్న ప్రియుడిపై కోపం పెంచుకున్న యువతి అతనిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన నంద్యాల మండలంలో చోటుచేసుకుంది. పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర,సుప్రియ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని, నాగేంద్ర ఆమెను పెళ్లి చేసుకోకుండా, ప్రేమకు బ్రేకప్ చెప్పాడు.

వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఘాతుకం
ఆ తరువాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
దీంతో తనను మోసం చేసి, నాగేంద్ర వేరే మహిళను వివాహం చేసుకోవడాన్ని సుప్రియ జీర్ణించుకోలేకపోయింది. దీంతో అతనిపై యాసిడ్ తో దాడి చేసింది.అతని ముఖం మీద యాసిడ్ పోసింది. ఈ ఘటనలో నాగేంద్ర ముఖం, చెయ్యి కాలిపోయాయి. ప్రస్తుతం నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక యువతి చేసిన ఉన్మాద చర్య కు షాక్ అవుతున్నారు.

ఒకప్పుడు అమ్మాయిలపైనే యాసిడ్ దాడులు
ఒకప్పుడు అమ్మాయిలపైన మాత్రమే యాసిడ్ దాడులు జరిగేవి. ఇటువంటి ఉన్మాద చర్యలు మంచిది కాదని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది . అమ్మాయిలు కూడా అబ్బాయిలపై యాసిడ్ దాడులకు తెగబడటం ఇటీవల కాలంలో కామన్ గా మారిపోయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎవరు ఎవరిపై దాడి చేసినా తప్పే అంటున్నారు పోలీసులు . ఇలాంటి చర్యలు హానికరం అని చెప్తున్నారు .

ఈ ఆలోచనా విధానం సమాజానికి హానికరం
ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడటం ఎంత తప్పో , ప్రేమించిన వాళ్ళు దక్కలేదని దాడులు చెయ్యటం కూడా అంతే తప్పని చెప్తున్నారు . సమాజంలో ఈ ఉన్మాద చర్యలకు చెక్ పడాలి అంటే ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే దేశంలో హింస తప్ప ప్రశాంతత లేకుండా పోతుంది . మగవాళ్ళే కాదు , మహిళలు కూడా ఈ విధంగా ప్రవర్తించటం సమాజానికి నిజంగా ప్రమాదకరం . కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది .