నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చందమామ చెంతకు చంద్రయాన్ - 2.. ఆ మూడే కీలకమా?

|
Google Oneindia TeluguNews

శ్రీహరికోట : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న షార్ సెంటర్ ఇంకో విజయం నమోదు చేసేందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో చంద్రయాన్ - 2 ప్రయోగానికి ఆదివారం ఉదయం 6 గంటల 51 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దాదాపు 20 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగాక.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చందమామ చెంతకు చేరనుంది చంద్రయాన్ - 2. జీఎస్‌ఎల్‌వీ - మార్క్‌ 3 ఎం1 వాహక నౌక ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది.

 చంద్రయాన్-2 ప్రయోగానికి రెడీ

చంద్రయాన్-2 ప్రయోగానికి రెడీ

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌ - 2 ప్రయోగానికి ఆదివారం ఉదయం 6.51 నిమిషాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జీఎస్‌ఎల్‌వీ - మార్క్‌ 3 ఎం1 వాహన నౌకను రోదసీలోకి పంపేందుకు ప్రయోగ సన్నాహకాలు పూర్తయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. శనివారం నాడు షార్‌ సెంటర్‌లో రాకెట్‌ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. రాకెట్‌ ప్రయోగ రిహార్సల్స్‌ ద్వారా పలు అంశాలను పరిశీలించి అంతా ఓకే అనుకున్నాక ప్రయోగానికి పచ్చజెండా ఊపారు.

<strong>బీసీ మంత్రం జపిస్తున్న జగన్ ప్రభుత్వం.. సంక్షేమానికి పెద్దపీట..!</strong>బీసీ మంత్రం జపిస్తున్న జగన్ ప్రభుత్వం.. సంక్షేమానికి పెద్దపీట..!

మూడు దశల్లో రాకెట్ ప్రయోగం

మూడు దశల్లో రాకెట్ ప్రయోగం


జీఎస్‌ఎల్‌వీ - మార్క్‌ 3 ఎం1 వాహన నౌక చంద్రయాన్ - 2 ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మూడు దశలుగా విభజించారు. తొలుత క్రయో ఇంజిన్‌లో ద్రవ ఇంధనం నింపనున్నారు. రెండో దశలో భాగంగా ఎల్ - 110 ఇంజిన్‌లో ద్రవ ఇంధనం ఫిల్ చేస్తారు. అలా తొలిదశలో వాడే రెండు ఎస్ - 200 బూస్టర్లను ఘన ఇంధనంతో నింపుతారు. అనంతరం వాటిని రాకెట్‌కు అనుసంధానిస్తారు. ఆ ప్రక్రియ అంతా ముగిశాక.. రాకెట్‌లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థల పనితీరును మరోసారి తనిఖీ చేయనున్నారు. మొత్తానికి కౌంట్ డౌన్ జీరోకు చేరుకోగానే ఎస్ - 200 బూస్టర్లు రాజుకోవడంతో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది రాకెట్.

 చంద్రుడిపై పరిశోధనలు.. ప్రాసెస్ ఇలా

చంద్రుడిపై పరిశోధనలు.. ప్రాసెస్ ఇలా

నింగిలోకి చేరుకున్న తర్వాత రాకెట్ నుంచి కాంపోజిట్ మాడ్యూల్ విడిపోనుంది. అనంతరం అది 17 రోజుల పాటు రోదసీలో పయనించి చంద్రుడి సమీపంలోకి చేరనుంది. దాని తర్వాత మరో ఆరు రోజుల పాటు అంటే 22వ రోజు వరకు లూనార్ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలో చంద్రయాన్-2 పే లోడ్ సంచరిస్తుంది. అలా 22వ రోజు నాడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు. ఇక 22వ రోజు నుంచి 49వ రోజు వరకు అంటే 28 రోజులపాటు దీర్ఘావృత్తాకారంలో ఉండే లూనార్‌ బౌండ్‌ ఫేస్‌ కక్ష్యలో చంద్రయాన్‌-2 పరిభ్రమించనుంది.

ఆ తంతు ముగిశాక 50వ రోజు అడాప్టర్‌ నుంచి ఆర్బిటర్‌ వేరుపడేలా చేస్తారు. అందులోని అపోజీ మోటారును మండించడం ద్వారా.. చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అలా 54వ రోజు చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ను దించుతారు. అనంతరం అందులోని రోవర్‌ బయటకు వచ్చి 500 మీటర్ల పరిధిలో పయనిస్తూ చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది.

 ఈ మూడే కీలకం..!

ఈ మూడే కీలకం..!

చంద్రయాన్ - 2 ప్రయోగంలో భాగంగా జీఎస్‌ఎల్‌వీ - మార్క్‌ 3 ఎం1 రాకెట్ మోసుకెళ్లే కాంపోజిట్‌ మాడ్యూల్‌లో మూడు పరికరాలు అత్యంత కీలకమైనవి. అవి ల్యాండర్‌, ఆర్బిటర్‌, రోవర్‌. ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ఇక ల్యాండర్‌ చంద్రుడిపై దిగనుంది. ఇక ల్యాండర్‌లో ఉండే రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్లపై పరిశోధన చేయనుంది.

చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో రోవర్‌, ల్యాండర్‌, ఆర్బిటర్‌ ను అనుసంధానం చేశారు. దాని బరువు 3 వేల 447 కిలోలు. ఇందులో ఒక ప్రొపెల్లర్‌ బరువే 1179 కిలోలు. ప్రయోగం జరిగిన అయిదు రోజుల తరువాత భూ నియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహం ప్రవేశించనుంది. అక్కడ నుంచి 3 లక్షల 50 వేల కిలోమీటర్ల దూరం చంద్రుని వైపు పయనించనుంది. ఆ విధంగా సెప్టెంబర్ 6,7 తేదీల్లో చంద్రునిపై ల్యాండర్‌ కాలుమోపే అవకాశం ఉందంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

<strong>ప్రేమికుడి మోసం బెడిసికొట్టింది.. ఆసుపత్రిలో ప్రేమ పెళ్లి..!</strong>ప్రేమికుడి మోసం బెడిసికొట్టింది.. ఆసుపత్రిలో ప్రేమ పెళ్లి..!

లైవ్ టెలికాస్ట్.. రాష్ట్రపతి వీక్షణం

లైవ్ టెలికాస్ట్.. రాష్ట్రపతి వీక్షణం

చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు దూరదర్శన్‌లో లైవ్ టెలికాస్ట్ కానుంది. ఇక ఆన్‌లైన్‌లో వీక్షించే వెసులుబాటు కూడా కల్పించారు. ఇస్రోకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. అదలావుంటే ఆనవాయితీ ప్రకారం ఇస్రో ఛైర్మన్ శివన్ శనివారం నాడు సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లిని దర్శించుకున్నారు. మొదట తిరుమల, శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడ దర్శనానంతరం సూళ్లూరుపేటకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని శ్రీహరికోటకు చేరుకున్నారు.

చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్ షార్ సెంటర్‌కు రానున్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి శ్రీహరికోటకు చేరుకుంటారు. సోమవారం ఉదయం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్ ప్రయోగాన్ని వీక్షించనున్నారు.

English summary
The twenty hour countdown for the launch of Chandrayaan-2 mission, India's most ambitious space mission yet which aims to place a robotic rover on the moon, began this morning at 6.51 am. The moon mission will be launched on Monday at 2:51 am from India's only space port at Sriharikota. ISRO will use its most powerful rocket launcher, GSLV Mk III, to carry the 3.8 tonne Chandrayaan-2 into orbit. The entire mission has a life of one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X