• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమే: అమరావతి రైతుల పాదయాత్రలో భాగస్వామ్యం

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ప్రత్యక్ష ఆందోళనల్లో దిగనుంది. రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్‌పై ఒత్తిడిని తీసుకొచ్చేలా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకుని రానుంది.

న్యాయస్థానం టు దేవస్థానం..

న్యాయస్థానం టు దేవస్థానం..

ఇందులో భాగంగా- అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనబోతోంది. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ మనసు మార్చాలంటూ అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర రుద్రకోట వద్ద నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. 45 రోజుల పాటు అమరావతి ప్రాంత రైతులు తలపెట్టిన పాదయాత్ర ఇది.

పాదయాత్రలో బీజేపీ నేతలు

పాదయాత్రలో బీజేపీ నేతలు

ఇక బీజేపీ నాయకులు కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యులు కానున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు వారు పాదయాత్రలో పాల్గొంటారు. నెల్లూరు జిల్లా కావలిలో వారు పాదయాత్రతో కలుస్తారు. రైతులతో కలిసి నడుస్తారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీమంత్రి సుజన చౌదరి, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ పాదయాత్రలో పాల్గొంటారు.

టీడీపీ లీడ్..

టీడీపీ లీడ్..

అమరావతి రైతులు తలపెట్టిన ఈ నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. రైతులకు అండగా ఉంటున్నామంటూ టీడీపీ నేతలు తరచూ ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటూ వస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఆందోళనలకు సారథ్యాన్ని వహించిన సందర్భాలు ఉన్నాయి. రైతులకు మద్దతుగా ఆయన జోలె సైతం పట్టారు.

ఇక బీజేపీ కూడా..

ఇక బీజేపీ కూడా..

ఇక బీజేపీ కూడా అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలవనుంది. 150 నుంచి 200 మంది అమరావతి ప్రాంత రైతులు, కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడిన ఈ న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో కాషాయ పార్టీ భాగస్వామ్యం కానుంది. జాతీయ స్థాయి నాయకులను సైతం ఇందులోకి దింపనుంది. ఈ పాదయాత్రలో పాల్గొనడం ద్వారా మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకం అనే సందేశాన్ని పంపించినట్టయింది.

అమిత్ షా ఆదేశాలే కారణమా?

అమిత్ షా ఆదేశాలే కారణమా?

కొద్దిరోజుల కిందటే బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఏపీలో పర్యటించారు. తిరుపతిలో నిర్వహించిన సదరన్ జోనల్ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన బీజేపీ రాష్ట్రశాఖ నాయకులతో భేటీ అయ్యారు. అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలవాలంటూ అమిత్ షా.. వారికి దిశా నిర్దేశం చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

దీన్ని బీజేపీ నాయకులెవరూ తోసిపుచ్చలేదు. ఆ తరువాతే- సోము వీర్రాజు నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తాము పాదయాత్రలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ డిమాండ్ చేశారు.

రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు

రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు

రైతుల పాదయాత్రకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటించామని సోము వీర్రాజు తెలిపారు. అన్ని జిల్లాలకు చెందిన బీజేపీ నాయకులు ఇందులో పాల్గొంటారని అన్నారు. రైతుల పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. రైతు పాదయాత్రపై ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని చెప్పారు. ఈ పాదయాత్రకు ప్రభుత్వం సహకరించాలే తప్ప అడ్డంకులను సృష్టించకూడదని అన్నారు. రీజధాని అమరావతి లోనే ఉండాలని, తమ పార్టీ అదే కోరుకుంటోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పురంధేశ్వరి అన్నారు. విభజన చట్టంలో 90 శాతం హామీలను పూర్తి చేసిందని చెప్పారు. ఏపీకి ప్రయోజనాలను కల్పించే విషయంలో కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గదని ఆమె హామీ ఇచ్చారు. ఏపీ ఆర్ధిక స్ధితి సరిగా లేనప్పుడు కేంద్రమే నిధులను ఇచ్చి, ఆదుకుందని చెప్పారు. ఏపీలో అభివృద్ధి జరుగుతోందంటే అది కేంద్రం చలవేనని అన్నారు. అమరావతి అభివృద్ధికి 1,500 కోట్ల రూపాయలను కేటాయించామని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ సహకరించట్లేదనేది అవాస్తవమని పురంధేశ్వరి అన్నారు.

దిగజారుడు భాష

దిగజారుడు భాష

పవిత్ర అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య భాష దిగజారిందని పురంధేశ్వరి అన్నారు. సభలో ప్రజల సమస్యలపై కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చర్చలు సాగుతున్నాయని, ఇది బాధాకరమని చెప్పారు. ఇలాంటి వైఖరిని తాము సమర్థించట్లేదని అన్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదని, దీనిపై అధికార పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంత రైతుల కల సాకారం అయ్యేలా చేస్తామని భరోసా ఇచ్చారు.

English summary
The AP BJP leaders will participate in the ‘Maha Padayatra’ being undertaken by Amaravati farmers on November 21. BJP leaders Purandeswari, Y Satya Kumar, Kanna Lakshminarayana, Sujana Chowdary, CM Ramesh expected to participate in the Padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X