నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరులో మంత్రి మేకపాటి లేఖ కలకలం- అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు...

|
Google Oneindia TeluguNews

ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అనూహ్యంగా కోపమొచ్చింది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయాలు తెలియని నేతగా, అధికారులతోనే ఎక్కువగా గడిపే నేతగా పేరు తెచ్చుకున్న గౌతం రెడ్డికి అదే అధికారుల తీరుపై కోపమొచ్చింది. సొంత జిల్లా నెల్లూరులో స్వయంగా తన క్యాంపు ఆఫీసు వద్ద పారిశుద్ధ్యం దారుణంగా ఉందని సిబ్బంది పలుమార్లు స్ధానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇక ఆయనే నేరుగా రంగంలోకి దిగారు.

రాష్ట్రంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని నిత్యం స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు ఆయన కేబినెట్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్యాన్నే అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీనిపై పలుమార్లు మంత్రి క్యాంపు కార్యాలయం సిబ్బంది నుంచి అధికారులకు ఫోన్లు వెళ్లాయి. అయినా వారు పట్టించుకోలేదు. కారణం స్ధానికంగా నెలకొన్న రాజకీయాలే. జిల్లాలో మంత్రికి జగన్ బాధ్యతలు కట్టబెట్టడం జీర్ణించుకోలేని కొందరు సొంత పార్టీ నేతలే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి గౌతంరెడ్డిని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే కోవలో మంత్రి ఆదేశాలు కూడా లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ap minister mekapati complains to nellore collector on sanitary officials negligence

తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి గౌతంరెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు అధికారుల తీరుపై ఓ లేఖ రాశారు. ఇందులో స్ధానిక హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ తన ఆదేశాలను కూడా లెక్కచేయకుండా క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడం లేదని మంత్రి మేకపాటి ఫిర్యాదు చేశారు. తన పరిస్ధితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ఆయన లేఖలో ప్రశ్నించారు.
ఇటీవలే మున్సిపల్ అధికారులతో మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రివ్యూ కూడా చేశారు.

ఇదే రివ్యూలో ఆరేడు నెలల్లో‌ నగరం రూపురేఖలు మార్చేస్తామని‌ మంత్రి ప్రకటించారు. అధికారుల సమావేశంలో అనిల్ అలా ప్రకటన చేసి వారం తిరగక ముందే మంత్రి మేకపాటి చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.అధికారుల తీరుపై స్వయంగా మంత్రి మేకపాటి ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు కలెక్టర్‌ ఏం చర్యలు తీసుకోబోతున్నారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సొంతపార్టీలోనే ప్రత్యర్ధులుగా మారిన కొందరు నేతల మాట విని అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారా, ఒక వేళ చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

English summary
andhra pradesh industries minister mekapati goutham reddy wrote a letter to nellore collector chakradhar babu over officials negligence over maintaining sanitation at his camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X