నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ షురూ.. 20 గంటల తర్వాత నింగిలోకి ...

|
Google Oneindia TeluguNews

శ్రీహరికోట : చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. సాయంత్రం 6.43 గంటలకు కౌంట్ డౌన్ స్టార్టై .. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు కొనసాగుతుంది. సరిగ్గా మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ ప్రయోగాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు.

chandrayan count down start

జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక చంద్రయాన్-2ను నింగిలోకి తీసుకెళ్తుంది. 3.8 టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాన్ని వాహకనౌక రోదసిలోకి తీసుకెళ్తుంది. చంద్రయాన్-2 ఉపగ్రహన్ని ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున ప్రయోగం నిర్వహించాల్సి ఉంది. కానీ చివరి గంటలో రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. తర్వాత లోపాన్ని సరిచేసి .. వారం గడవకముందే మళ్లీ ప్రయోగిస్తామని తేదీని ఖరారు చేశారు. ఆ మేరకు కౌంట్ డౌన్ ఏర్పాటు చేశామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

English summary
The countdown to the Chandrayaan-2 experiment has begun. The countdown to StarTay at 6.43pm will continue until 2.43pm on Monday. Chandrayaan will be launched at Sathish Dhawan Space Center in Sriharikota, Nellore district at exactly 2.43 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X